బాధ్యతలు చేపట్టిన నూతన కేంద్ర ఎన్నికల కమిషనర్లు…!

రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం
ప్రెస్‌ మీట్‌. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించనున్న ఈసీ. లోక్‌సభతో పాటు ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించనున్న సీఈసీ. లోక్‌సభతో పాటు ఏపీ, ఒడిషా, అరుణాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాలకు ఎన్నికలు.

బాధ్యతలు చేపట్టిన నూతన కేంద్ర ఎన్నికల కమిషనర్లు..

https://youtube.com/shorts/7q994pB91o4?si=rsAqhaeoBz7s75wn
కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారులు సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధూ, జ్ఞానేశ్‌ కుమార్ నియమి తులైన విషయం తెలిసిందే. తాజాగా వీరు ఈసీఐలో చేరారు. కమిషనర్లుగా శుక్రవారం ఉదయం అధి కారికంగా బాధ్యతలు చేపట్టారు.

ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘానికి రాజీవ్‌ కుమార్‌ చీఫ్‌ కమిషనర్‌గా ఉన్నారు. కమిషనర్‌గా ఉన్న అనూప్‌ చంద్ర పాండే గత నెలలో పదవీ విరమణ చేయగా.. మరో కమిషనర్‌ అరుణ్‌ గోయెల్‌ ఇటీవలే అనూ హ్యంగా రాజీనామా చేశారు.

దీంతో కొత్త కమిషనర్ల నియామకం అనివార్య మైంది. గురువారం ప్రధాని మోదీ నేతృత్వంలో సమా వేశమైన కమిటీ కొత్త కమి షనర్లుగా సుఖ్‌బీర్‌ సింగ్‌ సింధూ, జ్ఞానేశ్‌ కుమార్‌ లను ఎంపిక చేసింది.

ఈ మేరకు గురువారం కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. తాజాగా వీరు కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా బాధ్యతలు చేపట్టారు.

కేరళకు చెందిన కుమార్‌, ఉత్తరాఖండ్‌కు చెందిన సంధూ ఇద్దరూ 1988 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారు లు.

కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతి పత్తినిచ్చే ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన సందర్భంలో కుమార్‌ హోంమంత్రిత్వ శాఖలో సేవలు అందించగా, సంధూ గతంలో ఉత్తరా ఖండ్‌ ప్రభు త్వానికి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిం చారు…