రూ. ల‌క్ష అంత‌కు మించి బ్యాంకు లావాదేవీ ల‌పై నిఘా పెట్టాల‌ని రాష్ట్రాల‌కు ఈసీ లేఖ‌…

రూ. ల‌క్ష అంత‌కు మించి బ్యాంకు లావాదేవీ ల‌పై నిఘా పెట్టాల‌ని రాష్ట్రాల‌కు ఈసీ లేఖ‌..

*ఎన్నిక‌లపై డబ్బు ప్ర‌భావాన్ని క‌ట్ట‌డి చేసేందుకు రాష్ట్రాల‌ను అప్ర‌మ‌త్తం చేసిన‌ కేంద్ర ఎన్నిక‌ల సంఘం..*

*రాజ‌కీయ పార్టీల ఖాతాల నుంచి చేప‌ట్టే లావాదేవీలపై నిఘా పెట్టాలని సూచ‌న‌..

*రూ. 10 ల‌క్ష‌ల‌కు మించి న‌గ‌దు విత్‌ డ్రా లేదా జ‌మ‌పై త‌ప్ప‌నిస‌రిగా నిఘా పెట్టాలన్న ఎన్నిక‌ల సంఘం.

లోక్‌సభ ఎన్నికల 2024 దృష్ట్యా, ఎన్నికల సమయంలో పారదర్శకత మరియు నిధుల దుర్వినియోగాన్ని నిరోధించడానికి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఎన్నికల సంఘం కఠినమైన నిబంధనలను అమలు చేసింది. కొత్త నిబంధనల యొక్క ముఖ్య అంశాలు ఇక్కడ ఉన్నాయి:

పెద్ద నగదు బదిలీల కోసం నోటిఫికేషన్ అవసరం
– ఒక ఖాతా నుంచి పలు ఖాతాలకు నగదు బదిలీ జరిగితే బ్యాంకు నోడల్ అధికారులు ఎన్నికల విభాగానికి తెలియజేయాల్సి ఉంటుంది.
– ఈ సమాచారాన్ని అందించడంలో విఫలమైతే ఎన్నికల సంఘం చట్టపరమైన చర్య తీసుకోవచ్చు…

రెండు నెలల్లో రూ.లక్షకు మించి జమ, విత్‌ డ్రా చేసిన ఖాతాలు, ఒకే జిల్లాలో అనేక మందికి ఆన్‌లైన్‌ బదిలీ అయిన ఖాతాల వివరాలు సేకరించాలని సూచించింది. రూ.లక్షకు మించి జమ, డిపాజిట్‌ చేసిన అభ్యర్థి లేదా కుటుంబసభ్యుల, పార్టీల ఖాతాల వివరాలు సేకరించాలని తెలిపింది.

రూ.10లక్షల జమ, డిపాజిట్ల వివరాలు ఐటీకి ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. బ్యాంకుల నుంచి జిల్లా ఎన్నికల అధికారులు సమాచారం తెప్పించు కోవాలని, అనుమానం ఉంటే వాటి వివరాలు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లకు ఇవ్వాలని తెలిపింది..