రెండు రాష్ట్రాల ఎన్నికలకు నేడు షెడ్యూల్ ప్రకటన..!!!

*ఢిల్లీ.. దేశంలో రెండు రాష్ట్రాలకు ఎన్నికల నగరా మోగనుంది. ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించనుంది.
మధ్యాహ్నం 3 గంటలకు షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది. గుజరాత్ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఫిబ్రవరి 18తో గడువు ముగుస్తుంది, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ గడువు జనవరి 8తో ముగుస్తుంది. ఎన్నికల ప్రక్రియపై సమీక్షించేందుకు ఎన్నికల కమిషన్ అధికారులు ఇటీవల రెండు రాష్ట్రాల్లో సందర్శించారు.