నేటి నుండి మూడు రోజుల పాటు రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన..

*బ్రేకింగ్…*

నేటి నుండి మూడు రోజుల పాటు రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన….

_వరుస సమావేశాలతో బిజి బజీగా గడపనున్న కేంద్ర ఎన్నికల సంఘం …_

_ఇవాళ మద్యాహ్నం 12 గంటలకు హోటల్ తాజ్ కృష్ణకు చేరుకుంటారు….

మూడు రోజుల పాటు హోటల్ లోనే సమావేశాలు….

ఈ నెల 5వతేదీన మద్యాహ్నం ప్రెస్ కాన్ఫరెన్స్…..

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో వరుస సమావేశాలతో బిజి బజీగా గడపనున్న కేంద్ర ఎన్నికల సంఘం.
తాజాగా నేడు మరోసారి తెలంగాణకు వస్తున్నారు పీఎం మోదీ. ఈ సారి నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రైల్వే, విద్యుత్ సహా పలు మౌళిక అభివృద్ధి పనులకు శంకుస్థాపనతో పాటు మరికొన్నిటిని జాతికీ అంకితం చేయనున్నారు. ఈ నేపథ్యంలో నేటి నుండి మూడు రోజుల పాటు రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో వరుస సమావేశాలతో బిజి బజీగా గడపనున్న కేంద్ర ఎన్నికల సంఘం. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు హోటల్ తాజ్ కృష్ణకు చేరుకుంటారు.మూడు రోజుల పాటు హోటల్ లోనే తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నెల 5వతేదీన మధ్నాహ్నం ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.

ముఖ్యంగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఎలా నిర్వహించాలి? ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉండాలి, ఎన్ని EVMలు అవసరం, ఎంత సెక్యూరిటీ ఉండాలి.. ఇలా అన్ని అంశాలనూ పరిశీలించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (ECI) నుంచి ఓ బృందం ఈ అంశాలను పరిశీలంచనుంది. హైదరాబాద్‌లో ఈ టీమ్ 3 రోజులు ఉంటుంది. ఆ సందర్భంగా.. మొత్తం రాష్ట్రంలో ఎన్నికల ఏర్పాట్ల వివరాలు తెలుసుకుంటుంది. అలాగే జాతీయ రాష్ట్ర పార్టీల నేతలను కలిసి మాట్లాడుతుంది…మొదటి రోజు ఈ ఎన్నికల టీమ్… ఎక్సైజ్, ఇన్‌కం టాక్స్, GST, ట్రాన్స్‌పోర్ట్, ఇతర నిఘా విభాగాల అధికారులను కూడా కలుస్తుంది. ఎన్నికల సమయంలో మనీ, మద్యం, ఫ్రీ గిఫ్టులు ఇవ్వకుండా ఎలా అడ్డుకోవాలి అనే అంశంపై వారితో చర్చిస్తుంది. ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే, వారిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవాలి అనే దానిపైనా చర్చిస్తుంది.
రాష్ట్రంలో ఓటర్లకు అవగాహనా కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో కూడా ఈ టీమ్ పరిశీలిస్తుంది. సెలెబ్రిటీలు, దివ్యాంగ ఓటర్లు, యంగ్ ఓటర్లను కలుస్తుంది. ఓటర్ల లిస్ట్ కోసం క్యాంపెయిన్ చేస్తున్న ఓటర్లను కూడా కలుస్తుంది. ఇలా ఈ టీమ్ ఉన్న 3 రోజులూ రెస్ట్ లేకుండా తిరుగుతుంది. తర్వాత ఢిల్లీ వెళ్లి.. తన రిపోర్టును ECIకి ఇస్తుంది. తర్వాత ఈసీ రంగంలోకి దిగి.. ఎన్నికలు జరిపించేస్తుంది. నవంబర్ లేదా డిసెంబర్ ప్రారంభంలో ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది.

ప్రస్తుత BRS ప్రభుత్వం 2018 డిసెంబర్ 13న అధికారంలోకి వచ్చింది. అందువల్ల డిసెంబర్ 12, 2023 వరకూ ఈ ప్రభుత్వానికి గడువు ఉంటుంది. కొత్త ప్రభుత్వం డిసెంబర్ 12 తర్వాత కొలువు దీరాల్సి ఉంటుంది. అందువల్ల కేంద్ర ఎన్నికల సంఘం… తెలంగాణ ఎన్నికలపై ఫుల్ ఫోకస్ పెడుతోంది. వీటితో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, రాజస్థాన్, మిజోరాంలకు తెలంగాణతో పాటు ఎన్నికలు జరగనున్నాయి.