వ్యాపారవేత్త నివాసంలో ఈడీ సోదాలు.. రూ.1 కోటి వరకు సీజ్..!!

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ వరుస సోదాలు నిర్వహిస్తోంది. శనివారం ఉదయం ఢిల్లీకి చెందిన ఓ బిజినెస్ మ్యాన్ నివాసంలో దర్యాప్తు సంస్థ తనిఖీలు ప్రారంభించింది. ఈ సోదాల్లో భాగంగా ఈడీ అతడి నివాసం నుంచి రూ.1 కోటి వరకు స్వాధీనం చేసుకుంది. నగదును స్వాధీనం చేసుకున్న ఈడీ సంబంధిత వ్యాపార వేత్తకు విచారణలో పాల్గొనాలని తెలుపుతూ నోటీసులు జారీ చేయనుందని సమాచారం. అయితే ఈడీ శుక్రవారం జరిపిన సోదాల్లో ఈ వ్యాపార వేత్త ఇళ్లు కూడా ఉంది. కాగా శనివారం మరోసారి సోదాలు చేసిన నగదును స్వాధీనం చేసుకుంది. అయితే ఈ కేసులో నిందితుడైన సమీర్ మహేంద్రును విచారించిన ఈడీ ఈ కేసులో ఆంధ్రప్రదేశ్, పంజాబ్‌లకు సంబంధాలను ఉన్నట్లు దర్యాప్తు సంస్థ కనుగొంది. అయితే ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కాంలో భాగంగా సమీర్ రెండు సార్లు అరెస్ట్ అయ్యాడు. మొదటి సారి సీబీఐ అతడిని అరెస్ట్ చేయగా, రెండో సారి ఈడీ అతడిని కస్టడీలోకి తీసుకుంది.