ఈడీ ఆఫీసులో ఎమ్మెల్సీ కవితను కలిసిన కేటీఆర్‌, హరీశ్‌రావు…

ఢిల్లీలోని ఈడీ కార్యాల యంలో ఎమ్మెల్సీ కవితను భర్త అనిల్‌తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్‌, హరీశ్‌రావు కొద్దిసేపటి క్రితం కలిశారు..

ఆమె అరెస్ట్‌ను సవాల్‌ చేస్తూ అనిల్‌ సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయనున్నట్టు సమాచారం.

ఢిల్లీ మద్యం కేసులో శుక్ర వారం అరెస్ట్‌ అయిన బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవితకు రౌజ్‌ ఎవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఈనెల 23వరకు ఈడీ కస్టడీ విధించిన విషయం తెలిసిందే…