రాత్రంతా ఈడీ ఆఫీసులోనే కేజ్రీవాల్…

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాత్రంతా ఈడీ (ED) ఆఫీసులోనే ఉన్నారు. నేటి ఉదయం మరోసారి వైద్యపరీక్షలను అధికారులు నిర్వహించనున్నారు..

అనంతరం ఉదయం11 గంటల తర్వాత రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court)కు తరలించనున్నారు. స్పెషల్ సీబీఐ కోర్టు (CBI Court) జడ్జి కావేరీ బవేజా ఎదుట ఈడీ అధికారులు హాజరుపరచనున్నారు. 10 రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని కోరుతూ కస్టడీ పిటిషన్‌ను ఈడీ దాఖలు చేయనుంది. కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఈడీ కార్యాలయం, రౌస్ అవెన్యూ కోర్టు కాంప్లెక్స్ వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కేంద్ర పారామిలటరీ బలగాలను ఢిల్లీ పోలీసు (Delhi Police) యంత్రాంగం రంగంలోకి దించింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు ఎక్కడికక్కడ నేడు ధర్నాలు నిర్వహించే అవకాశం అవకాశం ఉంది..