డ్యామ్‌లో పడవ బోల్తా…విహారంలో యత్రకై పడవ ప్రయాణం..ఒకే ఫ్యామిలీలో 8 మంది మృతి.

భారీ వర్షాల పడుతున్న పడుతున్న సమయంలొ డ్యామ్‌లో పడవ బోల్తా పడిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది అకాల మరణం చెందారు. ఈ విషాద ఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. కోడ్మెరా జిల్లాలో రాజ్‌ధన్‌వార్‌ ప్రాంతానికి చెందిన సీతారాం యాదవ్ కుటుంబం ఆదివారం సెలవు రోజు కావడంలో ఎంజాయ్‌మెంట్‌ కోసం పంచఖేరో డ్యామ్ వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో వారంతా ఓ పడవలో డ్యామ్‌ చూసేందుకు వెళ్లారు. ఇంతలో ప్రమాదవశాత్తు పడవ బోల్తా పడింది…
పడవలో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది నీటిలో మునిగిపోయి అకాల మరణం చెందారు. మరణించిన వారిని
సీతారాం యాదవ్ (40),
శివమ్ సింగ్ (17),
రాహుల్ కుమార్ (16),
అమిత్ కుమార్ (14),
సెజల్ కుమారి (16),
పాలక్ కుమారి (14),
హర్షల్ కుమార్ (8),
భావ (5)గా గుర్తించారు. ఈ ప్రమాదంలో ఆ కుటుంబానికి చెందిన ప్రదీప్ కుమార్, పడవ నడిపే వ్యక్తి మాత్రమే ఈది సురక్షితంగా ఒడ్డుకు చేరి ప్రాణాలతో బయటపడ్డారు…