ఆషాఢ మాస ఏకాదశి తొలి ఏకాదశి..

ఆషాఢ మాస ఏకాదశి తొలి ఏకాదశిగా (ఆషాఢ శుద్ధ ఏకాదశిగా) జరుపుకుంటారు. ఈ నెల 29 న ఈ తొలి ఏకాదశి పండగ జరుపుకోనున్నారు. దీనినే ” శయన ఏకాదశి, ప్రధమ ఏకాదశి” అని కూడా అంటారు. ఈ రోజు నుంచి శ్రీ మహవిష్ణువు క్షీరాబ్ధి యందు శయనిస్తాడు. గనుక దీన్ని ” శయన ఏకాదశి” అంటారు.
ఏకాదశి ప్రజలలో ఉండే చైతన్యానికి ప్రతీక. యోగ నిద్రఅంటే భూమిపై రాత్రి సమయాలు పెరుగుతున్నాయని చెప్పటానికి సూచన. అంటే ప్రజలలో నిద్రా సమయాలు పెరుగుతాయన్నమాట.
వానాకాలంలో వచ్చే మొదటి ఏకాదశి కనుక తొలి ఏకాదశి అని లౌకికంగా చెబుతారు.
ఏకదశి అంటే పదకొండు అంటే అయిదు జ్ఞానేంద్రియాలు, అయిదు కర్మేంద్రియాలు, మనస్సు కలిపి మొత్తం పదకొండు.
వీటిని మనిషి తన అధీనంలోకి తీసుకువచ్చి వాటినన్నటినీ ఒకటిగా చేసి, అప్పుడు దేవునికి నివేదన చేయాలి.
దీనివలన మనిషికి సహజంగా అలవడే బద్దకం దూరమవుతుందని, రోగాలు దరిచేరకుండా ఉంటాయని,
ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని ఒక నమ్మకం.