ఏలినాటి శనిని తగ్గించే సూర్య దేవాలయం…

ఏలినాటి శనిని తగ్గించే సూర్య దేవాలయం…

🌺 తమిళనాడులోని కుంభకోణం చుట్టుపక్కల నవగ్రహాలకు వేర్వేరుగా తొమ్మది దేవాలయాలు ఉన్న విషయం తెలిసిందే. అందులో ఒకటే సూర్య దేవాలయం. మిగిలిన అన్ని నవగ్రహ ఆలయాల్లో ప్రధాన దైవం శివుడు కాగా ఈ దేవాలయంలో సూర్యుడే ప్రధాన దైవం. ఇక్కడ సూర్యభగవానుడి వేడిని తగ్గించడానికి నవగ్రహాల్లో ఒకటైన గురుడు ఆ సూర్య భగవానుడికి ఎదురుగా ఉంటారు. అదేవిధంగా శివాలయంలో లింగానికి లేదా శివుడికి ఎదురుగా నంది ఉన్నట్లు ఈ ఆలయంలో సూర్య భగవానుడికి ఎదురుగా గుర్రం ఉంటుంది.

🌺 రధసప్తమి సమయంలో పదిరోజుల పాటు పెద్ద ఎత్తున ఈ సూర్య దేవాలయంలో ఉత్సవాలు జరుగుతాయి. సూర్యభగవానుడికి చక్రపొంగలి నైవేద్యంగా పెడుతారు. అదే చక్రపొంగలిని ప్రసాదంగా భక్తులకు అందజేస్తారు. కుంభకోణం పట్టణానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది . సూర్యుడు ప్రధాన దైవం అయితే ఒక్క సూర్యుడి దేవాలయంలో మాత్రం పరమశివుడు కాక సూర్యుడు ప్రధాన దైవంగా ఉంటాడు. అందువల్లే ఈ దేవాలయంలో సూర్యుడితో పాడు గురుడిని 12 ఆదివారాలు ఆలయంలోనే ఉండి కొలిస్తే ఏలినాటి శని వదులుతుందని భక్తుల నమ్మకం.

🌺
ఆలయంలో భక్తులు ఉండటానికి ఏర్పాట్లు ఉన్నాయి. ఇలా ఆలయంలోనే ఉండి పూజలు చేయడాన్ని స్థలవాసం అంటారు. ఈ స్థలవాసం చేయడానికి దేశంనలుమూలల నుంచి ఎంతో మంది నిత్యం ఇక్కడకు వస్తుం ది.

🌺 కుళోత్తంగ చోళుడు
ఇక ఈ ఆలయం చాలా ప్రాచీనమైనది. ప్రస్తుతమున్న ఆలయాన్ని కుళోత్తుంగ చోళుడు నిర్మించాడు. అటు పై విజయనగర రాజుల కాలంలో అభివ`ద్ధి చెందింది. ఐదు అంతస్తుల రాజ గోపురం, ఉట్టూ గ్రానైట్ తో నిర్మించిన ప్రహరీగోడ ఉంటుంది.

🌺 ఉషా, ఛాయా దేవతలు
ఇక ఆలయ గర్భగుడిలో మధ్యలో సూర్యభగవానుడు కొలువై ఉండగా అటుపక్కా ఇటు పక్కా ఉషా, ఛాయా దేవతలు ఉంటారు. సూర్యుడు వేడికి చిహ్నం. ఆయన ఉన్న ప్రాంతమంతా చాలా వేడిగా ఉంటుంది.

🌺 నవగ్రహాల్లో ఒకటైన గురువు
ఆ వేడి వాతావరణాన్ని చల్లబరచడానికి అన్నట్లు ఇక గర్భగుడిలోనే సూర్య భగవానుడికి ఎదురుగా నవగ్రహాల్లో ఒకటైన గురువు ఉంటాడు. అందువల్ల సూర్యుడి వేడి కొంత తగ్గి ఉంటుందని భక్తుల నమ్మకం. సూర్యుడి రథాన్ని లాగేది గుర్రాలు.

🌺 సూర్యుడి విగ్రహానికి ఎదురుగా గుర్రం
అందువల్లే శివాలయంలో లింగానికి లేదా శివుడికి ఎదురుగా నంది ఉన్నట్లు ఈ ఆలయంలో సూర్య భగవానుడికి ఎదురుగా గుర్రం ఉంటుంది. ఆలయంలో సూర్యుడు పటమర ముఖంగా ఉంటాడు. రెండు చేతుల్లో కలువపువ్వులతో ప్రసన్న వదనంతో భక్తులకు సూర్య భగవానుడు దర్శనమిస్తాడు.

🌺 రథ సప్తమి రోజు
రధసప్తమి సమయంలో పదిరోజుల పాటు పెద్ద ఎత్తున ఈ సూర్య దేవాలయంలో ఉత్సవాలు జరుగుతాయి. అదే విధంగా తమిళ నెలల్లో మొదటి రోజున కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు జరుపుతారు. దీనినే మహాభిషేకం అంటారు.

🌺 చక్ర పొంగలి నైవేద్యం
అదేవిధంగా శని, గురువారాలతో పాటు గ్రహాలు ఒక నక్షత్రం నుంచి మరో నక్షత్రంలోకి మారేటప్పుడు కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇక సూర్యభగవానుడికి చక్రపొంగలి నైవేద్యంగా పెడుతారు. అదే చక్రపొంగలిని ప్రసాదంగా భక్తులకు అందజేస్తారు.

🌺 కుంభకోణం పట్టణానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు నిత్యం ఇక్కడకు అందుబాటులో ఉంటాయి. ఈ క్షేత్రానికి దగ్గర్లోనే తిరుమంగళకుడి, కంజనూర్ అనే క్షేత్రాలు కూడా ఉన్నాయి…