ఈనెల 15న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్న కేంద్ర ఎన్నికల సంఘం..

BIG BREAKING..NEWS..

న్యూఢిల్లీ

ఈనెల 15న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్న కేంద్ర ఎన్నికల సంఘం..

లోక్‌సభతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించనున్న ఈసీ

ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం

ఈనెల 11న ఎన్నికల పరిశీలకులతో సమావేశం కానున్న కేంద్ర ఎన్నికల సంఘం

ఈనెల 12, 13 తేదీల్లో జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించనున్న కేంద్ర ఎన్నికల సంఘం

14న పూర్తిస్థాయిలో మరోసారి ఎన్నికల సన్నద్ధతపై సమీక్షించి 15న షెడ్యూల్ ప్రకటించనున్న కేంద్ర ఎన్నికల సంఘం…

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ నెల 14 లేదా 15 తేదీల్లో లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్నట్టు తెలుస్తొంది. కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందం ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పర్యటించింది. సోమవారం నుంచి బుధవారం వరకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు జమ్మూకశ్మీర్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటన ముగియగానే లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తొంది…..ఈ ఏడాది సెప్టెంబర్‌లోగా జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశించింది. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికలతో పాటు జమిలి అసెంబ్లీకి కూడా ఎన్నికలు నిర్వహించడం సాధ్యమేనా అని పరిశీలించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి బుధవారం వరకు అధికారులు రాష్ట్రంలో పర్యటించనున్నారు. బుధవారం జమ్మూకశ్మీర్ పర్యటన ముగించుకుని ఎన్నికల సంఘం గురువారం లేదా శుక్రవారం లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయినే దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ అమల్లోకి రానుంది…