లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ ….. అమల్లోకి ఎన్నికల కోడ్‌..

*సార్వత్రిక ఎన్నికలు వివరాలు…*

*సార్వత్రిక ఎన్నికలలో భాగంగా జూన్ 16 లోపు ఎన్నికలు పూర్తి…రాజీవ్ కుమార్*

1..కోటి 55 లక్షల మంది సిబ్బంది…

2..55 లక్షల ఈవీఎం లు వినియోగం….

3..10 లక్షల 50 వేల పోలింగ్ కేంద్రాలు….

4.. కోటి 82 లక్షల మంది కొత్త ఓటర్లు….

5..97 కోట్ల మంది ఓటర్లు…

*మొదలైన ఎన్నికల కోడ్.

పోలింగ్ స్టేషన్ల వద్ద ఉండే సౌకర్యాలివే..

తాగునీరు..
టాయిలెట్స్.

దివ్యాంగుల కోసం ర్యాంప్‌ లేదా వీల్‌ఛైర్‌లు
హెల్ప్ డెస్క్
ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ .

లోక్ సభ ఎన్నికల(Loksabha Elections 2024 )తో పాటు 4 రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తుంది. ఏపీ, ఒడిశా, అరుణచలం, సిక్కీం రాష్ట్రాలలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. విజ్ఞాన్‌భవన్‌ ప్లీనరీ హాల్‌లో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌, కమిషనర్లు జ్ఞానేశ్‌కుమార్‌, సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధులతో కలిసి 18వ లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తున్నారు….జూన్ 16వతేదీన లోక్‌సభ గడువు ముగుస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీల గడువు జూన్‌లో ముగిసిపోనున్నట్టు వివరించారు. జమ్ముకశ్మీర్‌లో ఇంకా ఎన్నికలు జరగాల్సి ఉందని తెలిపారు. దేశవ్యాప్తంగా 97 కోట్ల ఓటర్లు రిజిస్టర్ అయినట్టు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 10.5 లక్షల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్టు వివరించారు. దాదాపు కోటిన్నర మంది పోలింగ్ అధికారులు ఈ ఎన్నికల ప్రక్రియని పరిశీలించనున్నారు. సెక్యూరిటీ స్టాఫ్‌నీ నియమించనున్నట్టు ఈసీ వెల్లడించింది. 55 లక్షల ఈవీఎమ్‌లు, 4 లక్షల వాహనాలు సిద్ధం చేయనున్నట్టు సీఈసీ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. దాదాపు 12 రాష్ట్రాల్లో పురుషుల కన్నా మహిళా ఓటర్ల సంఖ్యే ఎక్కువగా ఉందని వెల్లడించారు. తొలిసారి ఓటు వేసే వారి సంఖ్య కోటి 80 లక్షల వరకూ ఉందని తెలిపారు. 20-29 ఏళ్ల మధ్య వయసున్న ఓటర్ల సంఖ్య 19.47 కోట్లుగా ఉంది. 85 ఏళ్లు దాటిన వారికి, దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటు వేసే వెసులుబాటు (Vote From Home) కల్పిస్తామని రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. జూన్ 16లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని ప్రకటించారు.

*🔹📢SCHEDULE for General Elections to Andhra Pradesh Legislative Assembly. Details☝️*

*#AssemblyElections2024*