ఎలక్ట్రిక్‌ వాహనాల్లో మంటల పై కేంద్రం సీరియస్…. ఆయ కంపెనీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు…..

పెట్రో ధరలతో క్రమంగా ప్రజలు ఎలక్ట్రిక్‌ వాహనాలవైపు మొగ్గుచూపుతున్నారు.. అయితే, దేశవ్యాప్తంగా ఈ మధ్యే.. పలు వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి.. ఇంట్లో చార్జింగ్‌ పెట్టిన సమయంలోనే కొన్ని.. రోడ్లపై మరికొన్ని ప్రమాదాలు గురయ్యాయి.. కొంతమంది ప్రాణాలు కోల్పోయారు.. దీంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది.. అయితే, ఈ వ్యవహారంపై సీరియస్‌ అయ్యారు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ.. ఆయా వాహ‌నాల కంపెనీల‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు గడ్కరీ.. లోపాలున్న వాహ‌నాల‌ను త‌క్షణ‌మే రీకాల్ చేయాల‌ని ఆదేశించారు.. అంతేకాకుండా ఇప్పటిదాకా చోటుచేసుకున్న ప్రమాదాల‌పై విచార‌ణ జ‌రిపి.. ఆయ కంపెనీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు….