49 సబ్‌స్టేషన్లను లక్ష్యంగా చేసుకుని, విద్యుత్తు వ్యవస్థపై దాడికి యత్నించిన చైనా..!

విద్యుత్తు వ్యవస్థపై దాడికి విఫలయత్నం
ఎస్‌ఎల్డీసీ సర్వర్లలోకి మాల్‌వేర్‌ను పంపే కుట్ర
సీఈఆర్టీ హెచ్చరికలతో అప్రమత్తమైన అధికారులు
49 సబ్‌స్టేషన్లను లక్ష్యంగా చేసుకున్నట్టు గుర్తింపు
నెట్‌ కనెక్షన్‌ నిలిపివేత, పాస్‌వర్డ్‌లు మార్పు…

49 సబ్‌ స్టేషన్లలో హ్యాకింగ్‌ ప్రయత్నం
ఎస్‌ఎల్డీసీతో అనుసంధానమైన రాష్ట్రంలోని 49 సబ్‌స్టేషన్లను హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నారని ఐటీ నిపుణులు గుర్తించినట్టు తెలిసింది. దీంతో ఆ సబ్‌స్టేషన్లకు, ఎస్‌ఎల్డీసీతో ఉన్న కనెక్షన్‌ను నిలిపివేశారు. ఈ సబ్‌ స్టేషన్లను ఎక్కడికక్కడ ఐసొలేట్‌ చేశారు. సీఈఆర్టీ-ఇన్‌ నుంచి వచ్చిన పలు ఐపీ అడ్రస్‌లను పరిశీలించారు. వీటిలో రెండు ఐపీలపై అనుమానాలు బలపడటంతో వెంటనే వాటిని బ్లాక్‌చేశారు. ఎస్‌ఎల్డీసీ, స్కాడా రక్షణ వ్యవస్థకు సంబంధించిన సర్వర్లలోకి ప్రవేశించే అవకాశం ఉన్న అధికారులు, సిబ్బంది, ఇంజినీర్ల క్రెడెన్షియల్స్‌, పాస్‌వర్డ్‌లను కూడా మార్చివేశారు. చైనా హ్యాకర్లు ఎంతకాలం నుంచి ఎస్‌ఎల్డీసీ రక్షణ వ్యవస్థలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారో తెలియలేదు. ఎస్‌ఎల్డీసీ రక్షణ వ్యవస్థ పటిష్ఠంగా ఉండటం, ఆధునిక టెక్నాలజీని వాడుతుండటం వల్లనే హ్యాకర్లు చొరబడలేకపోయారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. …

దేవులపల్లి ప్రభాకర్‌రావు, ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ..

సీఈఆర్టీ-ఇన్‌ నుంచి వచ్చిన హెచ్చరికలతో అప్రమత్తం అయ్యాం. చైనాకు చెందిన థ్రెట్‌ యాక్టర్‌ గ్రూప్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సర్వర్ల నుంచి తెలంగాణ ఎస్‌ఎల్డీసీకి అనుసంధానమైన వ్యవస్థలలోకి చొరబడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు సీఈఆర్టీ నుంచి స్పష్టమైన హెచ్చరికలువచ్చాయి. దీంతో పవర్‌ సిస్టం భద్రతకు సరైన రక్షణ చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీచేశాం. అనుమానాస్పద ఐపీ అడ్రస్‌లను బ్లాక్‌ చేశాం. ఎస్‌ఎల్డీసీ నుంచి మారుమూల ప్రాంతాలలోని సర్క్యూట్‌ బ్రేకర్లను నియంత్రించే విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేశాం. స్కాడా కంట్రోల్‌ సెంటర్‌ పరిధిలో అనుమానాస్పదంగా కనిపించిన అంశాలన్నింటినీ వేరు చేశారు. దీనివల్ల గ్రిడ్‌ భద్రత, వినియోగదారులకు ఎటువంటి ఆటంకం లేకుండా విద్యుత్‌ సరఫరా సాధ్యమవుతున్నది…