గత ఏడాదితో పోలిస్తే రాష్ట్ర యువతలో నిరుద్యోగ రేటు స్వల్పంగా తగ్గింది.

స్వల్పంగా తగ్గిన నిరుద్యోగం
R9TELUGUNEWS.COM..
గత ఏడాదితో పోలిస్తే రాష్ట్ర యువతలో నిరుద్యోగ రేటు స్వల్పంగా తగ్గింది. 2020 జనవరి..మార్చిలో ఇది 28.8% ఉండగా 2021 జనవరి-మార్చినాటికి 4.5% తగ్గి 24.3 శాతంగా నమోదైంది. ఇది జాతీయ సగటు(22.9) కన్నా ఎక్కువేనని కేంద్ర గణాంకశాఖ కార్మికబలగం సర్వే నివేదికలో వెల్లడైంది. ఇంకా 60% యువత కార్మిక బలగానికి దూరంగా ఉంది….రాష్ట్రంలో 2020 ఏడాది త్రైమాసిక గణాంకాలతో పోల్చితే కార్మిక బలగంలో చేరిన యువకుల వాటా 57.6 శాతం నుంచి 58.2 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో నిరుద్యోగ రేటు 24.8 శాతం నుంచి 24.3 శాతానికి తగ్గింది.. వ్యవసాయ పరిశ్రమల్లో పనిచేస్తున్న వారి శాతం 3.31 నుంచి 4.53 శాతానికి పెరిగింది. ఈ రంగంలో పురుషుల వాటా 3.41 శాతం ఉంటే.. మహిళల వాటా 7.97శాతంగా ఉంది…