సురేశ్​ రైనా అత్తామామల హత్యకేసు.. నిందితుడిని ఎన్​కౌంటర్​ చేసిన పోలీసులు..

*మాజీ క్రికెటర్ సురేశ్ రైనా అత్తామామలను హత్య చేసిన నిందితుడిని UP పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. 2020లో రైనా అత్తామామ ఇంట్లో చోరీకి పాల్పడ్డ నిందితుడు రషీద్.. అడ్డుకోబోయిన వారిద్దరితోపాటు రైనా బావమరిదిని తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటనలో రైనా అత్తామామ మృతి చెందారు. అప్పటినుంచి అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు…

ముజఫర్​నగర్​లోని షాపుర్​లో శనివారం జరిగింది. నిందితుడు రషీద్​ను సోరం-గోయ్లా రహదారిపై ఎన్​కౌంటర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతకుముందు నిందితుడిపై రూ.50 వేల రివార్డు కూడా ఉందని వెల్లడించారు…

2020 ఆగస్టు 19న పఠాన్‌కోట్‌లోని క్రికెటర్ సురేశ్ రైనా అత్త, మామ ఇంట్లో రషీద్ చోరీకి పాల్పడ్డాడు. నిందితులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన సురేశ్ రైనా మామ అశోక్ కుమార్, అత్త ఆశా, బావమరిది కౌశల్ కుమార్‌లను రషీద్ తీవ్రంగా గాయపరిచాడు. అశోక్ అక్కడికక్కడే మృతి చెందగా.. ఆశా, కౌశల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను గతేడాది సెప్టెంబరులో పోలీసులు పట్టుకున్నారు..