ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఎవరెస్ట్‌పై అరుదైన పల్లాస్‌ పిల్లులు..

కాఠ్మాండూ: ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఎవరెస్ట్‌పై అరుదైన పల్లాస్‌ పిల్లులు జీవిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు..2019లో పలు దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు ట్రాసీ సీమన్‌ ఆధ్వర్యంలో ఎవరెస్టు పై గల సాగర్‌మాతా జాతీయ పార్కులో పరశోధనలు చేపట్టారు. పర్యావరణ నమూనాలు సేకరించారు. జన్యు విశ్లేషణ జరపగా పల్లాస్‌ పిల్లులు ఎవరెస్టుపై జీవిస్తున్నాయని గుర్తించారు.

ఈ పిల్లులు సాధారణ పిల్లుల కంటే భిన్నంగా కనిపిస్తాయి. పొట్టి కాళ్లు, పొడవాటి వెంట్రుకలు ఉంటాయి. తీవ్ర చలిని కూడా తట్టుకునేందుకు వీటి పొడవాటి వెంట్రుకలే కారణం.