సాయింత్రం వార్తలు….

*రాష్ట్రానికి చేరుకున్న కేంద్ర ఎన్నికల బృందం*

కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం హైదరాబాద్కు చేరుకుంది.

చీఫ్ ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, అరుణ్ గోయల్, అనూప్ చంద్రపాండేతోపాటు మరికొంత మంది సభ్యులు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోగా అధికారులు స్వాగతం పలికారు.

కాసేపట్లో ఈ బృందం రాజకీయ పార్టీలతో సమావేశం కానుంది.

మూడు రోజులపాటు ఈ బృందం రాష్ట్రంలో పర్యటించి అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
———————-

గాడ్సే టెర్ర‌రిస్ట్..జాతిపిత మ‌హాత్మాగాంధీని చంపిన మొట్ట‌మొద‌టి టెర్ర‌రిస్ట్ ..!

చెరువు నిండిన తర్వాత కప్పలు చాలా వస్తాయని, అలాగే పార్టీ బాగున్నప్పుడు కూడా చాలామంది నేతలు వస్తూనే ఉంటారని, అయితే కష్టాల్లో ఉన్నప్పుడే మనవాళ్లు ఎవరో తెలుస్తుందని మంత్రి కేటీఆర్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఏర్పాటు చేసిన మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ధర్మపురి నియోజకవర్గం ఎమ్మెల్యే, మంత్రి కొప్పుల ఈశ్వర్‌పై ప్రశంసలు కురిపించారు. పార్టీ ఎలాంటి పరిస్థితులలో ఉన్నా కొప్పుల మాత్రం పార్టీ వెంటే నడిచారన్నారు. తాను ఊపిరి ఉన్నంత వరకు పార్టీ మారనని పదిహేనేళ్ల క్రితమే చెప్పారని గుర్తు చేశారు. అన్నట్లుగానే ఆయన నిత్యం తమతోనే ఉన్నారన్నారు…

జాతిపిత మ‌హాత్మాగాంధీని చంపిన మొట్ట‌మొద‌టి టెర్ర‌రిస్ట్ గాడ్సే అన్నారు. గాడ్సేను ఆరాధించే పార్టీ మ‌నకు అవ‌స‌ర‌మా? అని ప్రశ్నించారు. ఇలాంటి బీజేపీతో పొత్తు పెట్టుకునే ఖర్మ తమకు లేదన్నారు. ఆర్ఎస్ఎస్ నుంచి వ‌చ్చిన వ్య‌క్తిని, ఓటుకు నోటు దొంగ‌ను ఇవాళ పార్టీ ప్రెసిడెంట్‌గా పెట్టుకున్న న‌క్క‌జిత్తుల కాంగ్రెస్ ఎన్ని మాట‌లు మాట్లాడినా నమ్మవద్దన్నారు. బీజేపీకి, బీఆర్ఎస్‌కు సంబంధం ఉంద‌ని ఇవాళ చాలామంది అంటున్నారని, కానీ మోదీని కేసీఆర్ విమర్శించినంతగా ఎవరూ విమర్శించడం లేదన్నారు. మోదీ ఏం చేశాడని ఆయ‌న‌తో తాము అంటకాగుతామని ప్రశ్నించారు. మోదీ దేవుడ‌ని బండి సంజ‌య్ చెబుతున్నారని, సిలిండ‌ర్ ధ‌ర‌, పెట్రోల్, నిత్యాస‌వ‌రాలు పెంచినందుకా మోదీ దేవుడు? అని ప్ర‌శ్నించారు.

——————–
*చంద్రబాబు క్వాష్ పిటిషన్పై విచారణ*

*వాయిదా..!*

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారణ ముగిసింది.

ఈ కేసును సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదీలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

గవర్నర్ ముందస్తు అనుమతి లేకుండా స్కిల్ స్కామ్ కేసులో ఏపీ సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే…
———————

రేపట్నుంచి బతుకమ్మ చీరల పంపిణీ.. 250 డిజైన్లలో 1.02 కోట్ల చీరలు.

ఇప్పటికే జిల్లా కేంద్రాలకు చేరవేత..

రూ.354 కోట్లతో చేనేత సంఘాల ఆధ్వర్యంలో చీరల తయారీ..
————————–

*🔹రాష్ట్రానికి చేరుకున్న కేంద్ర ఎన్నికల బృందం..

కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం హైదరాబాద్‌కు చేరుకుంది. చీఫ్ ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, అరుణ్ గోయల్, అనూప్ చంద్రపాండేతోపాటు మరికొంత మంది సభ్యులు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోగా అధికారులు స్వాగతం పలికారు.

_కాసేపట్లో ఈ బృందం రాజకీయ పార్టీలతో సమావేశం కానుంది. మూడు రోజులపాటు ఈ బృందం రాష్ట్రంలో పర్యటించి అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
—————–
*పవన్ కళ్యాణ్ కు అస్వస్థత*

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెన్ను నొప్పితో బాధపడుతున్నారు.

మంగళవారం కృష్ణా జిల్లాలో నిర్వహించిన జనవాణిలో ఆయన ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకుంటూ నొప్పి భరించలేక మధ్యలో నుంచే వెళ్లిపోయారు.

ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారని సమాచారం.
——————–

*ఢిల్లీలో భూకంపం*

ఢిల్లీలోని ఎన్సీఆర్ లో భూకంపం సంభవించింది.

దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రిక్టర్ స్కేల్ పై 5.5 తీవ్రతగా నమోదైంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..
————–

మంత్రి హరీష్ రావుపై దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దుబ్బాక పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతు రఘునందన్ రావు మాట్లాడుతు.. దుబ్బాక ఉప ఎన్నికల్లో ఇచ్చినట్లు మళ్లీ ప్రొసీడింగ్స్ కాగితాలకే పరిమితం తప్ప చేసింది ఒక్క పని ఉండదుని విమర్శించారు. దుబ్బాక నుండి ముస్తాబాద్, మెదక్ నుంచి చేగుంట వరకు డబుల్ రోడ్డు మంజూరు చేయిస్తే శంకుస్థాపన చేసింది నువ్వు కాదా హరీష్? అంటూ ప్రశ్నించారు. దౌల్తాబాద్ నుండి చేగుంట రోడ్డుకు సెంట్రల్ ఫండ్ తెచ్చింది నిజం కాదా? అన్నారు…
———————–

రేవంత్ పిటీషన్ డిస్మిస్ చేసిన సుప్రీం కోర్ట్

ఓటుకు నోటు కేసులో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి చుక్కెదురైంది. సుప్రీంకోర్టులో ఆయన వేసిన పిటిషను ధర్మాసనం డిస్మిస్ చేసింది. కాగా 2015 ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీఫెన్సన్కు డబ్బులిచ్చారని రేవంత్ రెడ్డిపై అభియోగాలున్నాయి. అయితే ఈ కేసుకు అవినీతి నిరోధక చట్టం వర్తించదని కేసు కొట్టివేయాలంటూ రేవంత్ సుప్రీంను ఆశ్రయించారు.
———————–

మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసినా బండారు సత్యనారాయణ కు ఊరట..!

మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తికి బెయిల్ మంజూరు అయింది. మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అభియోగంపై ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు….
ఇవాళ అరెస్ట్ చేసి వైద్యలు పరిక్షలు నిర్వహించారు. కోర్టులో ప్రవేశ పెట్టారు. అయితే ఈ కేసులో బండారు సత్యనారాయణకు భారీ ఊరట లభించింది. తమకు బెయిల్ మంజూరు చేయాలన్న బండారు అభ్యర్థనను పరిశీలించిన కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు…

—————–
*🔹తాజ్ కృష్ణ కి చేరుకున్న ఆప్ నేతలు.*

_మరి కాసేపట్లో కేంద్ర ఎన్నికల బృందం తో భేటి._

_ఒక్కొక్క పొలిటికల్ పార్టీ తో సమావేశం.._

_• బిఅరెస్ నుంచి హాజరుకానున్న ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్,మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి._

కాంగ్రెస్ నుంచి హాజరుకానున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి,శ్రీధర్ బాబు,నిరంజన్._

బీజేపీ నుంచి హాజరుకానున్న ఎమ్మెల్యే రఘు నందన్ రావు,మర్రి శశిధర్ రెడ్డి.

తాజ్ కృష్ణ ఎన్నికల సంఘం భేటీ కి టిడిపి నుండి కేంద్ర కార్యదర్శి కాసాని వీరేష్ ,రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షులు శ్రీపతి సతీష్, లీగల్ సెల్ అధ్యక్షులు రాఘవేంద్ర ప్రతాప్..

రాష్ట్రానికి చేరుకున్న కేంద్ర ఎన్నికల బృందం..

▪️కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం హైదరాబాద్‌కు చేరుకుంది. చీఫ్ ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, అరుణ్ గోయల్, అనూప్ చంద్రపాండేతోపాటు మరికొంత మంది సభ్యులు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోగా అధికారులు స్వాగతం పలికారు.

▪️కాసేపట్లో ఈ బృందం రాజకీయ పార్టీలతో సమావేశం కానుంది. మూడు రోజులపాటు ఈ బృందం రాష్ట్రంలో పర్యటించి అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.