సాయంత్రం వార్తలు…

*ఢిల్లీ:-*

అశోకా రోడ్డు 50 లోని ఎంపీ గల్లా జయదేవ్ కార్యాలయంలో లోకేష్.

లోకేష్ కి వాట్సాప్ లో 41 ఏ నోటిసులు పంపిన సిఐడి అధికారులు.

నోటిసులు అందుకున్నాను అని
వాట్సాప్ లో సిఐడి అధికారులకు సమాధానం ఇచ్చిన లోకేష్.

అక్టోబర్ 4 న ఉదయం 10 గంటలకు సిఐడి కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్న సిఐడి అధికారులు.
__________________________________

*🔹కాంగ్రెస్ కి వైఎస్ షర్మిల పెట్టిన గడువు నేటితో పూర్తి.*

_రంగంలోకి దిగిన కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు_

_వైఎస్ షర్మిలతో చర్చలు జరిపిన సునీల్ కనుగోలు?_

_తుది దశకు చేరుకున్న YSRTP విలీన ప్రక్రియ_

*🔹రేపు,లేదా ఎల్లుండి ఢిల్లీకి వెళ్లనున్న వైఎస్ షర్మిల.*

_రాహుల్ ,సోనియా ల సమక్షంలో పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసే అవకాశం.

———————-
..
—————–
*అమెరికా లో ప్రారంభమైన ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు*

న్యూయార్క్:సెప్టెంబర్ 30
అమెరికాలో ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమెరికా క్యాపిటల్ భవనం ఎదుట ఉన్న విశాల ప్రాంగణంలో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.

ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆధ్వర్యంలో ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రపంచ సంస్కృతులలోని భిన్నత్వాన్ని ఒకే వేదికపై తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

100 దేశాలకు పైగా ఈ ఉత్సవాల్లో పాల్గొననున్నారు.ప్రపంచ వ్యాప్తంగా 17 వేల మంది కళాకారులు సాంస్కృతిక ఉత్సవాల్లో అనేక దేశాల నేతలు పాల్గొననున్నారు.
———————-
*ఉన్నంత అధికారులతో సిఎస్ శాంతి కుమారి అత్యవసర భేటీ*

హైదరాబాద్:సెప్టెంబర్ 29
తెలంగాణ సీ,ఎస్ శాంతికుమారి ఈరోజు అత్యవసరంగా కీలక అధికారుతో భేటీ అయ్యారు.

ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. కేంద్ర ఎన్నికల అధికారులు హైదరాబాద్ పర్యటనకు వస్తున్న సందర్భంగా సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

వచ్చేనెల మూడో తేదీ నుంచి సీఈసీ టీం నగరంలోనే ఉంటుందని తెలిపింది. కేంద్ర ఎన్నికల అధికారులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలతో పాటు సీనియర్ అధికారులు అందుబాటులో ఉండాలని సూచించింది.

రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్నందున వాటిపై అవగాహనా కలిగి ఉండాలని నిర్దేశించారు. పోలింగ్ కేంద్రలలో కనీస సౌకర్యాలు అందించేలా చూడాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు..
—————+++++

*ఎసిబికి అవినీతి తిమింగ‌లం చిక్కింది.*

నల్లగొండ జిల్లా మర్రిగూడ తాహశీల్దార్ మహేందర్ రెడ్డి నివాసం,బంధువుల ఇళ్ళపై అవినీతి నిరోధక శాఖ నేడు మెరుపు దాడులు నిర్వ‌హించింది.

*ఇంట్లో ట్రంకు పెట్టెలో దాచిన రెండు కోట్ల నగదు.*

నాలుగు కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు.. బంగారం విలువ‌ను మ‌దింపు చేస్తున్నారు..

అలాగే కోట్ల రూపాయల విలువైన ఇళ్ల స్థలాలు వ్యవసాయ భూముల డాక్యుమెంట్లను గుర్తించారు.. వాటిని సీజ్ చేశారు.. ప్ర‌స్తుతం ఆయ‌న నివాసంలోనూ, బంధువుల ఇళ్ల‌లోనే సోదాలు కొన‌సాగుతున్నాయి..

ఈ సోదాలు సాయంత్రం వ‌ర‌కు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని అధికారులు వెల్ల‌డించారు. దీనిపై మ‌రింత స‌మాచారం తెలియాల్సి ఉంది.
______________________

*దివ్యాంగ భర్తను కొడవలితో నరికిన భార్య*

మదనపల్లి:

మంగళ సూత్రం ఏమైందని భార్యను భర్త ప్రశ్నించడంతో భర్తను కొడవలితో నరికిన ఘటన మదనపల్లి మండలంలో శనివారం వెలుగు చూసింది. పెంచుపాడు పంచాయతీ కట్టుబావి గొల్లపల్లికు చెందిన వెంకటరమణ (44) భార్య మంగమ్మ మెడలో మంగళసూత్రం కనిపించకపోవడంతో నిలదీశాడు. నీకెందుకు సమాధానం చెప్పాలని ఎదురు తిరగడంతో ఇద్దరూ గొడవపడ్డారు. ఆగ్రహంతో దివ్యాంగుడైన భర్తపై భార్య కొడవలితో దాడి చేసింది.
———————————

ఏషియన్ గేమ్స్ 2023 పోటీల్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం చేరింది. పురుషుల స్క్వాష్ టీమ్ ఈవెంట్ ఫైనల్‌లో పాకిస్తాన్‌ని 2-1 తేడాతో విజయం సాధించింది భారత జట్టు మొదటి మ్యాచ్‌లో భారత స్క్వాష్ ప్లేయర్‌ మహేశ్ మంగోకర్, పాక్ ప్లేయర్ నసీర్ చేతుల్లో 3-0 తేడాతో ఓడాడు. అయితే వరుసగా రెండు మ్యాచుల్లో ఓడి అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చారు భారత స్క్వాష్ ప్లేయర్లు.అయితే శ్రేయాస్ ఘోషల్ రెండో మ్యాచ్‌లో గెలిచి 1-1 మ్యాచ్‌ని టై చేశాడు. ఆ తర్వాత అభయ్ సింగ్, డిసైడర్ మ్యాచ్‌ని 3-2 తేడాతో గెలుచుకున్నాడు. దీంతో భారత స్క్వాష్ పురుషుల జట్టుకి పసిడి పతకం దక్కింది. తొలి రెండు సెట్లు ఓడి 0-2 తేడాతో వెనకబడిన తర్వాత వరుసగా మూడు సెట్లు గెలిచి, పాక్‌కి ఊహించని షాక్ ఇచ్చాడు అభయ్ సింగ్..

మహిళల వెయిట్ లిఫ్టింగ్‌లో భారత గోల్డెన్ లేడీ మీరాబాయి ఛాను నిరాశపరిచింది. స్కాచ్ రౌండ్‌లో 83 కిలోలు ఎత్తిన మీరాబాయి ఛాను, క్లీన్ అండ్ జెర్క్ రౌండ్‌లో 108 కిలోలు ఎత్తింది. అయితే ఓవరాల్‌గా 191 కిలోలతో నాలుగో స్థానంలో నిలిచిన మీరాబాయి, పతకాన్ని మిస్ చేసుకుంది..

బాక్సింగ్ పురుషుల 92 కిలోల విభాగంలో భారత బాక్సర్ నరేంద్ర బేర్వాల్ సెమీస్ చేరాడు. సెమీస్‌లో విజయం సాధిస్తే, నేరుగా ఒలింపిక్స్‌కి అర్హత సాధిస్తాడు నరేంద్ర..

43 ఏళ్ల భారత టెన్నిస్ వెటరన్ ప్లేయర్ రోహన్ బోపన్న సంచలనం క్రియేట్ చేశాడు. మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో ఫైనల్ చేరిన భారత జోడి రోహన్ బోపన్న, రుతురాజ్ భోసలే స్వర్ణం కైవసం చేసుకుంది. చైనీస్ తైపాయ్ జోడితో జరిగిన ఫైనల్‌లో 2-6, 6-3, 10-4 తేడాతో విజయం అందుకున్నారు రోహన్ బోపన్న – రుతురాజ్ భోసలే..

టేబుల్ టెన్నిస్‌ మహిళల సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్ చేరిన భారత టీటీ ప్లేయర్ మానికా బత్రా, వరల్డ్ నెం.4 వాంగ్ యిదీతో జరిగిన మ్యాచ్‌లో 2-4 తేడాతో ఓడిపోయింది. మహిళల బాక్సింగ్‌లో 75 కిలోల విభాగంతో భారత స్టార్ బాక్సర్ లోవ్‌లినా బోర్గోహైన్, సెమీ ఫైనల్‌కి దూసుకెళ్లింది.