కోదాడ లో ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తూ పట్టుబడ్డ విద్యార్థి..!!

ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తూ పట్టుబడ్డ విద్యార్థి..

పదవ తరగతి పబ్లిక్ భౌతిక శాస్త్ర , జీవశాస్త్ర పరీక్షలో ఒక విద్యార్థికి బదులు మరొక విద్యార్థి పరీక్ష రాస్తూ పట్టుబడ్డ సంఘటన

సూర్యపేట జిల్లా:

కోదాడ పట్టణంలోని సిటీ సెంట్రల్ పరీక్షా కేంద్రంలో పరీక్షకు బానోతు హనుమ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెదవీడు కు చెందిన విద్యార్థి హాల్ టికెట్ నెంబర్ 22 30 2001 2 అనే హల్ టికెట్ నెంబర్ తో హాజరు కావాల్సి ఉండగా అతని స్థానంలో పానుగల్లు మంజునాథ్ మఠంపల్లి మండలం కృష్ణ తండాకు చెందిన విద్యార్థి పరీక్ష రాయడానికి వచ్చాడు . పరీక్ష హాల్ లో పరీక్ష రాస్తుండగా ఆ హాల్ ఉన్న ఇన్విటేషన్ విధులు నిర్వహిస్తున్న జి శైలజ హాల్ టికెట్లో ఉన్న ఫోటో కు పరీక్ష రాస్తున్న విద్యార్థికి వ్యత్యాసం ఉండడంతో ఒకరికి బదులు మరొకరు పరీక్షలు రాస్తున్న అని గుర్తించి ఆ కేంద్రం చీఫ్ సూపర్డెంట్ రాజు దృష్టికి తీసుకెళ్లారు . కాగా వారు దర్యాప్తు చేసి ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తున్నట్లు గా నిర్ధారించారు. పై అధికారుల ఆదేశాల మేరకు పోలీసులకు సమాచారం ఇచ్చారు . పట్టణ ఎస్ఐ నాగభూషణం పరీక్ష కేంద్రానికి వచ్చి పట్టుబడ్డ విద్యార్థిని చీఫ్ సూపర్డెంట్ రాజు ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్ కు తరలించారు . విద్యార్థిపై పరీక్ష అధికారుల ఫిర్యాదు మేరకు ఇమ్ పర్ సెషన్ కేస్ నమోదు చేస్తున్నట్లు తెలిపారు .