ఎగ్జామ్ ప్యాడ్‌లో మొబైల్ ఫోన్ పెట్టుకొచ్చిన 10వ తరగతి విద్యార్థి…

ఎగ్జామ్ ప్యాడ్‌లో మొబైల్ ఫోన్ పెట్టుకొచ్చిన 10వ తరగతి విద్యార్థి..

హర్యానాలో ప్రస్తుతం పదవ తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి. అయితే ఈ పరీక్షలో మాస్ కాపీయింగ్పై పెద్ద ఎత్తున ఫిర్యాదులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే 457 కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర విద్యాశాఖ తెలిపింది. నిర్లక్ష్యంగా విధులు నిర్వర్తిస్తున్న పది మంది పరీక్ష నిర్వహణ అధికారులను కూడా తొలగించారట. ఇదిలా ఉంటే.. ఒక విద్యార్థి పరీక్ష హాలులో కాపీ కొట్టిన విధానం ఆసక్తిగా మారింది. పరీక్ష రాసే ప్యాడులో మొబైల్ ఫోన్‌ను అతికించి.. వాట్సాప్ సందేశాల ద్వారా జవాబులు కాపీ కొట్టి పరీక్ష రాసేందుకు ప్రయత్నించాడు. ఇలా చేస్తూ స్థానిక చెకింగ్ స్కార్డ్‌కు దొరికిపోయాడు. ఫతేహాబాద్‌లోని భూతాన్ పరీక్ష హాలులో బుధవారం జరిగిందీ సంఘటన

ఈ విషయమై సెకండరీ బోర్డ్ అధికార ప్రతినిధి మీనాక్షి మాట్లాడుతూ ‘‘ఈరోజు నిర్వహించిన ఇంగ్లీషు పరీక్ష జరిగింది. అయితే పరీక్ష రాసే ప్యాడ్‌లో మొబైల్ ఫోన్‌ను అమర్చి ఒక విద్యార్థి వచ్చాడు. తన మొబైల్‌లో ఇంగ్లీషు సబ్జెక్ట్‌కు సంబంధించిన ప్రశ్న, జవాబులు ఉన్నాయి. మరొక పరీక్ష హాలులో ఒక విద్యార్థి మాట్రెస్ కింద దాచిన మొబైల్‌ను ఫ్లైయింగ్ స్క్వార్డ్ స్వాధీనం చేసుకున్నారు. మరొక పరీక్ష కేంద్రం వద్ద ఇద్దరు యువకుల నుంచి ఒక బొమ్మ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తులు పరీక్ష రాస్తున్న విద్యార్థులకు చిటీలు విసురుతుండగా పోలీసులు పట్టుకున్నారు’’ అని తెలిపారు…