కలవర పెడుతున్న కళ్లకలకలు..!..తీసుకోవాల్సిన జాగ్రత్తలు..!.

*తీసుకోవాల్సిన జాగ్రత్తలు..!*

*ప్రస్తుతం నలుగురిలో ఒకరికి కళ్ల కలకల సమస్య ఎదురవుతోంది. ఇది సీజనల్ వచ్చే ఇబ్బంది. కనుక భయపడాల్సిందేమీ లేదు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే, నిరోధించవచ్చు.*

*కొన్ని జాగ్రత్తలు..*

*1.మీ ఇంట్లో ఎవరికైన కళ్లు ఎర్రగా కనిపిస్తే వారి నుండి దూరంగా ఉండండి. అలాంటి వారు ఒక గదిలో ఉండి విశ్రాంతి తీసుకోవాలి. వీలయినంత వరకు కంటికి ఇబ్బంది కలిగించే పనులు వారు చేయకపోవడమే ఉత్తమం..!*

*2.కళ్లకలకలు వచ్చిన వారి కళ్లను చూడకూడదు. కళ్లలోకి చూడడం, వారి కళ్లు ఎలా ఉన్నాయాని పరిశీలన చేతరాదు.దాదాపు వారి దూరంగా ఉండడం శ్రేయస్కరం..!*

*3.వీలయితే పవర్ లేని కళ్లజోడు వాడే ప్రయత్నం చేయండి. ఎవరైనా కాంటాక్ట్ లెన్సులు వాడేవారు వాడకండి.*

*4.చేతులు శుభ్రంగా ఉంచుకోండి. ఎవరైనా కళ్లకలకలు ఉన్నవారిని తాకకండి. ఒకవేళ కళ్లు ఎర్రగా మారితే వాటిని చేయితో నలిపే ప్రయత్నం చేయరాదు.*

*5.కళ్లు ఇలా ఇబ్బందులు పడుతున్నప్పుడు ప్రయాణాలు చేయకండి.*

*6. పూర్తి విశ్రాంతితో ఉండండి. ఫోన్లు, టి.వీలు చూడవద్దు.

*7. డాక్టర్ ను కలసి మందులు, కళ్లకు చుక్కల మందులు తీసుకుని గంటకు ఓసారి వేసుకోండి.