ఎఫ్3(F3)… ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఫిబ్రవరి 7న విడుదల..!!

మ‌రోసారి టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించేందుకు ఎఫ్ 2 టీమ్ సిద్ధ‌మైంది. ఎఫ్ సీక్వెల్ ఎఫ్ 3ని ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి తెర‌కెక్కించ‌నున్నారు. ఇప్ప‌టికే ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తి కాగా.. త్వ‌ర‌లోనే ఈ క్రేజీ సీక్వెల్ సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. అయితే ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా వ‌చ్చిన ఎఫ్ 2 బాక్సాఫీస్ వ‌ద్ద మాత్ర‌మే కాదు జాతీయ స్థాయిలో ఆద‌ర‌ణ పొందింది…

ఎఫ్ 3…

వెంకటేశ్ – వరుణ్ తేజ్ లు కథానాయకులుగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ఎఫ్ 3. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. తాజాగా ఎఫ్ 3 మేకర్స్ మరో అప్ డేట్ ను ప్రకటించారు. సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ను ఈ నెల 7వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలిపారు మేకర్స్. ఈ మేరకు పోస్టర్ ను విడుదల చేశారు…..
మొదటి పాట లబ్ డబ్ లబ్ డబ్ డబ్బూ ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇక ఎఫ్ 3 కథ డబ్బు చుట్టూ తిరగబోతుందన్న సంగతి తెలిసిందే. సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. ఒక్క పాట మాత్రమే పెండింగ్‌లో ఉంది…ఇక రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందించారు. అలాగే నట కిరీటి రాజేంద్ర ప్రసాద్, సోనాల్ చౌహాన్ , సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు…చిత్రం వేసవి కానుకగా ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది…