ఫేస్‌బుక్ అకౌంట్‌ను ప‌ర్మినెంట్‌గా డిలీట్ చేయ‌డం ఎలా? ఇదిగో సింపుల్ స్టెప్స్‌…..

ఫేస్‌బుక్ అకౌంట్‌ను ప‌ర్మినెంట్‌గా డిలీట్ చేయ‌డం ఎలా? ఇదిగో సింపుల్ స్టెప్స్‌..

R9TELUGUNEWS.COM.
ఈరోజుల్లో ఫేస్‌బుక్ అకౌంట్ లేనివాళ్లను వెతికినా దొర‌క‌రు. చిన్నాపెద్దా.. ముస‌లి ముత‌కా.. అనే తేడా లేకుండా.. స్మార్ట్‌ఫోన్ వాడుతున్న ప్ర‌తి ఒక్క‌రు ఇప్పుడు ఫేస్‌బుక్ అకౌంట్‌ను క్రియేట్ చేసుకుంటున్నారు. త‌మ‌కు తెలియ‌క‌పోయినా.. తెలిసిన వారితో అకౌంట్ క్రియేట్ చేయించుకొని.. అందులో ఫోటోలు, వీడియోలు పెట్టి మురిసిపోతున్నారు. త‌మ‌కు తెలిసిన‌వారిని త‌మ ఫ్రెండ్ లిస్ట్‌లో యాడ్ చేసుకుంటున్నారు.

కొంద‌రు టైమ్‌పాస్ కోసం ఫేస్‌బుక్‌ను వాడితే మ‌రికొంద‌రు త‌మ బిజినెస్ కోసం, ప్ర‌మోష‌న్ కోసం వాడుతుంటారు. ఏది ఏమైనా.. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అన్నింటిలో ఫేస్‌బుక్ టాప్‌లో ఉంది.

అయితే.. కొంద‌రికి ఒక‌టి కంటే ఎక్కువ ఫేస్‌బుక్ అకౌంట్లు ఉంటాయి. కొంద‌రికి తెలియ‌క రెండు మూడు అకౌంట్లు క్రియేట్ చేసుకుంటారు. దీంతో ఫేస్‌బుక్‌లో స‌ద‌రు వ్య‌క్తిని కాంటాక్ట్ చేయ‌డం క‌ష్టం అవుతుంది. ఈనేప‌థ్యంలో.. ఒకటి కంటే ఎక్కువ ఉన్న అకౌంట్ల‌ను డిలీట్ చేసుకునే వెసులుబాటు కూడా ఫేస్‌బుక్ క‌ల్పిస్తోంది. కానీ.. చాలామందికి ఫేస్‌బుక్ అకౌంట్‌ను ప‌ర్మినెంట్‌గా ఎలా డిలీట్ చేయాలో తెలియ‌దు.

మొబైల్ యాప్ ద్వారా డెస్క్‌టాప్ ద్వారా కూడా ఫేస్‌బుక్ అకౌంట్‌ను ప‌ర్మినెంట్‌గా డిలీట్ చేయొచ్చు. దాని కోసం పెద్ద‌గా క‌ష్ట‌ప‌డాల్సిన అవ‌స‌రం కూడా లేదు.. ఈ సింపుల్ స్టెప్స్‌తో ఫేస్‌బుక్ అకౌంట్‌ను ఎలా డిలీట్ చేయాలో తెలుసుకుందాం రండి.

*_మొబైల్ యాప్ నుంచి ఫేస్‌బుక్‌ను డిలీట్ చేయ‌డం ఎలా?_*

ఆండ్రాయిడ్ అయినా ఐఓఎస్ అయినా.. ఇవే స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ముందు ఫేస్‌బుక్ యాప్‌ను ఓపెన్ చేసి టాప్ రైట్ కార్న‌ర్‌లో ఉన్న హ‌మ్‌బ‌ర్గ‌ర్ ఐకాన్‌ను(మూడు గీత‌లు) ఓపెన్ చేయాలి. కిందికి స్క్రోల్ చేసి Settings & Privacy మీద క్లిక్ చేయండి. అందులో సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. అక్క‌డ Your Facebook Information అనే ట్యాబ్ క‌నిపిస్తుంది. దాంట్లో Account Ownership and Control అనే ఆప్ష‌న్ మీద క్లిక్ చేయాలి. దాంట్లో Deactivation and deletion అనే ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. దాని మీద కూడా క్లిక్ చేస్తే రెండు ఆప్ష‌న్లు క‌నిపిస్తాయి. ఫేస్‌బుక్ అకౌంట్‌ను డియాక్టివేట్ చేసుకోవ‌చ్చు. లేదంటే డిలీట్ చేసుకోవ‌చ్చు. డియాక్టివేట్ చేస్తే ఫేస్‌బుక్ అకౌంట్ డియాక్టివేట్ అవుతుంది కానీ.. ఫేస్‌బుక్ మెసెంజ‌ర్‌ను వాడుకోవ‌చ్చు. డిలీట్ చేస్తే.. ఫేస్‌బుక్ డేటా మొత్తం డిలీట్ అయిపోతుంది. మెసెంజ‌ర్‌ను కూడా ఉప‌యోగించే అవ‌కాశం ఉండ‌దు. డేటాను కూడా తిరిగి పొందే అవ‌కాశం ఉండ‌దు. Continue to account deletion అనే బ‌ట‌న్ మీద క్లిక్ చేస్తే అకౌంట్ డిలీట్ అయిపోతుంది.

*_డెస్క్‌టాప్‌లో ఫేస్‌బుక్ అకౌంట్‌ను ఎలా డిలీట్ చేయాలి?_*

బ్రౌజ‌ర్‌లో ఫేస్‌బుక్‌ను ఓపెన్ చేసి.. టాప్ రైట్ కార్న‌ర్‌లో ఉన్న downwards arrow ను క్లిక్ చేయాలి. అందులో Settings & privacy ఆప్ష‌న్‌ను ఎంచుకొని.. Settings అనే ఆప్ష‌న్ మీద క్లిక్ చేయాలి. Your Facebook Information ట్యాబ్‌లో Privacy అనే ఆప్ష‌న్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. అక్క‌డ Your Facebook Information అనే ఆప్ష‌న్ మీద క్లిక్ చేసి.. Deactivation and Deletion అనేఆప్ష‌న్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. ఆ త‌ర్వాత View మీద క్లిక్ చేస్తే Delete account అనే ఆప్ష‌న్ వ‌స్తుంది. Continue to account deletion అనే ఆప్ష‌న్‌ను సెలెక్ట్ చేసుకొని Delete account మీద క్లిక్ చేసి.. పాస్‌వ‌ర్డ్‌ను వెరిఫై చేసి.. Continue మీద క్లిక్ చేయాలి. అంతే.. అకౌంట్ డిలీట్ అయిపోతుంది.

ఒక‌సారి అకౌంట్‌ను డిలీట్ చేశాక‌.. 30 రోజుల వ‌ర‌కు అకౌంట్‌ను రిక‌వ‌రీ చేసుకునే అవ‌కాశాన్ని ఫేస్‌బుక్ క‌ల్పిస్తుంది. 30 రోజుల దాటాక మాత్రం.. అకౌంట్‌ను రిట్రీవ్ చేసుకునే చాన్స్ ఉండ‌దు. ఫేస్‌బుక్ మెసెంజ‌ర్‌తో పాటు.. ఫేస్‌బుక్‌తో లాగిన్ అయిన ఇత‌ర యాప్స్‌కు కూడా యాక్సెస్ ఉండ‌దు.