ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవదహనం….

సజీవదహనం పంజాబ్​లోని లుథియానాలో ఓ ఇల్లు అగ్నికి ఆహుతి అయ్యింది. ఈ ప్రమాదంలో ఏడుగురు సజీవదహనమయ్యారు. చనిపోయిన వారందరూ ఒకే కుటుంబానికి చెందిన వారే కావడం గమనార్హం. ఉపాధి కోసం లుథియానాకు వలస వచ్చిన కార్మికులుగా వారిని గుర్తించారు అధికారులు. రాత్రి నిద్రపోతున్న సమయంలో ఇంటికి మంటలు అంటుకోవడం వల్ల ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో దంపతులతో పాటు ఐదుగురు పిల్లలు సజీవదహనమయ్యారు….