ఫేక్ ఆధార్ కార్డ్ ముఠా అరెస్ట్….

ప్రభుత్వానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలకు ఆధార్ కార్డే ఆధారం. దీంతో ఆధార్ కార్డు కోసం జనం నానా ఇబ్బంది పడుతున్నారు. ఈనేపథ్యంలో నకిలీ ఆధార్ కార్డులిస్తూ మోసం చేస్తున్నారు కొందరు కేటుగాళ్ళు. ఫేక్ ఆధార్ కార్డ్ ముఠా అరెస్ట్ చేశామన్నారు హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్. నకిలీ ఆధార్ కార్డులు తయారు చేసి అమ్ముతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఎనిమిది మంది సభ్యులు గల ముఠాను పట్టుకున్నారు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. గత కొన్నాళ్ల నుంచి నకిలీ ఆధార్ కార్డులు తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తోంది ఈ ముఠా.నకిలీ, ఫోర్జరీ డాక్యుమెంట్లతో ఆధార్ కార్డ్స్ తయారుచేస్తున్నారని, ఎనిమిది మందిని నార్త్ జోన్ టాసకరక ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారని అంజనీకుమార్ తెలిపారు. మరో వ్యక్తి మధ్యప్రదేశ్ వాసి పరారీలో ఉన్నాడన్నారు. ఈ ముఠాకు సంబంధించి ఆధార్ కిట్స్, స్టాంప్స్, ఆధార్ కార్డ్ ఫామ్స్‌ , ఫోర్జరీ బర్త్ సర్టిఫికెట్, ఫేక్ ఆధార్ కార్డ్ , 80వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఫోర్జరీ గెజిటెడ్ సంతకాలతో భారీ మోసం చేస్తోంది ఈ ముఠా.జీహెచ్ఎంసీ వెబ్ సైట్ లో డౌన్లోడ్ చేసి సర్టిఫికెట్స్ ఫోర్జరీ చేస్తున్నారు. మూడువేల ఆధార్ కార్డ్స్ ముఠా జారీచేసిందన్నారు అంజనీకుమార్. ఆ కార్డ్స్ ఫేక్ అని గుర్తించామన్నారు. ఒక్కో కార్డ్ కు వెయ్యి నుండి, రెండువేలు వసూలు చేస్తోంది ముఠా.