నకిలీ మహిళా పోలీస్ అరెస్టు..!

నకిలీ మహిళా పోలీస్ అరెస్టు..

నార్కట్ పల్లి గ్రామానికి చెందిన మాళవిక, శంకర్ పల్లిలో విధులు నిర్వహిస్తున్నట్లు నమ్మించింది. అయితే అర్.పి.ఎఫ్ యూనిఫాంలో రీల్స్ చేయటమే కాకుండా, పెళ్లి సంబంధం చూసేందుకు కూడా యూనిఫాంలోనే వెళ్లింది.

యూనిఫాంలోనే వీఐపి దర్శనాలు, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళడం చేసింది. పెళ్లి సంబంధాల కోసం అబ్బాయి తరపు వాళ్ళు అధికారులను సంప్రదించగా మోసం బయటపడింది.

అర్.పి.ఎఫ్ పోలీసులు మాళవికని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు..

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. పోలీసు కావాలనేది ఆమె కోరిక. అందుకోసం 2018లో జరిగిన ఆర్పీఎఫ్‌ ఎస్‌ఐ ఎగ్జామ్‌ రాసింది. కంటి చూపు సరిగా లేకపోవడం ఉద్యోగానికి ఎంపిక కాలేదు. దీంతో ఆర్పీఎఫ్‌ ఎస్‌ఐ అవతారమెత్తిన మాళవిక విధులకు వెళ్తున్నట్టు ఏడాది పాటు కుటుంబ సభ్యులను నమ్మించింది. పెళ్లి చూపులకు కూడా అదే యూనిఫాంలో వెళ్లి చివరికి జైలుపాలైంది..అబ్బాయి తరఫు బంధువులు ఆర్పీఎఫ్‌లో అధికారులను ఆరా తీయగా ఆమె అసలు గుట్టు బట్టబయలైంది. ఎల్‌బీ నగర్‌లోని ఆర్పీఎఫ్ పోలీసులు ధరించే యూనిఫాం కొనుగోలు చేసింది. రైల్వే ఎస్సైగా నల్గొండ లో విధులు నిర్వహిస్తున్నట్లు దాదాపు ఏడాది పాటు ప్రజలను నమ్మించి మోసాలకు తెరతీసింది. దేవాలయాలకు వెళ్లి, ప్రముఖులను కలిసి ఫోటోలు దిగి సోషల్‌ మీడియాలో పోస్టు చేసేది. వెంటనే అప్రమత్తమైన నల్గొండ ఆర్పీఎఫ్‌ సిబ్బంది మాళవికను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, అసలు విషయం బయటపడింది. ఆమెపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..