మాజీ సీఎం వివాదాస్పద వ్యాఖ్యలు..
ఢిల్లీ బాంబు పేలుడు, ఫరీదాబాద్‌లో ఉగ్ర సంబంధాలున్న వైద్యుల అరెస్టులపై మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైద్యులు దాడికి ఆ మార్గం ఎందుకు ఎంచుకున్నారో తెలుసుకోవాలన్నారు. ఆపరేషన్ సిందూర్‌తో ప్రయోజనం లేకపోగా.. 18 మంది మనవాళ్లు మృతి చెందారన్నారు. భారత్, పాక్ సంబంధాలు మెరుగుపడాలని సూచించారు.
ఫరూఖ్ పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. పాక్‌తో స్నేహమేంటని ప్రశ్నిస్తున్నారు..
గతంలో కూడా.
పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీరులో జాతీయ జెండాను ఎగురవేయడం గురించి పక్కనబెట్టండి, కనీసం శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లో జాతీయ జెండాను ఎగరేయగలరా? అని నిలదీశారు..పాక్ ఆక్రమిత కశ్మీరులో జెండా ఎగరేయడం గురించి మాట్లాడుతున్నారు. కానీ నేను వాళ్లని శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌కు వెళ్ళి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయమని అడుగుతున్నాను. వాళ్ళు ఆ పనిని ఇక్కడే చేయలేరు, పాక్ ఆక్రమిత కశ్మీరు గురించి మాట్లాడుతున్నారు..” అని పేర్కొన్నారు.