ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గరిమెళ్ల ప్రత్యూష ఆత్మహత్య..

ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ గరిమెళ్ల ప్రత్యూష ఆత్మహత్యకు పాల్పడింది. బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. తను నివసించే ఇంట్లోనే ప్రత్యూష ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆమె ఆత్మహత్యకు కారణం ఏంటనే విషయం ప్రస్తుతానికి తెలియలేదు. పోస్ట్‌మార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రత్యూష ఆత్మహత్య చేసుకున్న గదిలో కార్బన్ మోనాక్సైడ్ బాటిల్ పోలీసులకు లభ్యమైంది. కార్బన్ మైనాక్సైడ్ పీల్చడం వల్ల ఆమె చనిపోయినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. వెండితెర ప్రముఖ తారలైన జాక్వెలిన్, పరిణితి చోప్రా, మాధురి దీక్షిత్, కాజోల్ దేవగన్, విద్యా బాలన్, రవీనా టాండన్, నేహా దూపియా, శ్రుతి హాసన్, క్రీడాకారిణి సానియా మీర్జా, హీరోయిన్లు హుమా ఖురేషి, రకుల్ ప్రీత్ సింగ్, జుహీ చావ్లా, కృతి కర్బందాతో పాటు చాలా మంది ప్రముఖ తారలకు ప్రత్యూష ఫ్యాషన్ డిజైనర్‌గా వర్క్ చేసింది. బంజారాహిల్స్‌లో ఆమెకు Boutique కూడా ఉన్నట్లు తెలిసింది