హమాస్ పై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో టీవీ నటుడు ముందువరసలో నిలిచారు. హమాస్‌కు వ్యతిరేకంగా యుద్ధంలో భాగంగా ముందు వరుసలో ఉన్న బ్రదర్స్ ఇన్ ఆర్మ్స్ అనే స్వచ్ఛంద సమూహంలో టీవీ నటుడు చేరారు. ఇజ్రాయెల్ దేశంలో టెలివిజన్ ధారావాహిక ఫౌదాలో ఈయన నటించారు…ఇజ్రాయెల్ డెమోక్రసీ ఇన్ స్టిట్యూట్ ప్రెసిడెంట్ యోహానన్ ప్లెస్నర్, జర్నలిస్ట్ అవీ యిస్సాస్చారోవ్‌తో కలిసి యుద్ధరంగంలో ఉన్న వీడియోను నటుడు లియోర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ”యోహానన్ ప్లెస్నర్, అవీతో కలిసి వెళ్లి, వందలాది మంది ధైర్యవంతులైన బ్రదర్స్ ఇన్ ఆర్మ్స్ వాలంటీర్లతో కలిసి యుద్ధరంగంలో అవిశ్రాంతంగా పనిచేశాను” అని నటుడు ఎక్స్ లో పేర్కొన్నారు. బాంబు దాడి జరిగిన స్టెరోట్ పట్టణానికి వెళ్లానని టీవీ నటుడు చెప్పారు. గాజా స్ట్రిప్‌లో 560 మంది మరణించారు. ఇజ్రాయెల్ ఎదురుదాడిలో 2,900 మంది గాయపడ్డారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.