మారిన ఫేస్‌బుక్ పేరు…

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ కంపెనీ పేరు మారింది. ఇకపై ఈ సంస్థను ‘మెటా’గా పిలవనున్నారు. పేరు మార్పు విషయాన్ని ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌‌బర్గ్ గురువారం వెల్లడించారు. భవిష్యత్‌లో వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ (మెటావర్స్)కు ప్రాధాన్యత పెరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని జుకర్‌బర్గ్ తెలిపారు. ఫేస్‌బుక్ సంస్థ అధీనంలోని ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం, వాట్సాప్‌ల పేర్లలో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదు. వీటి మాతృసంస్థ అయిన ఫేస్‌బుక్ పేరును మాత్రమే మార్చారు. వర్చువల్ విధాంనలో కలసుకొని.. ఉత్పత్పులను తయారు చేసే వేదికగా మెటావర్స్‌ ఉండబోతోందని జుకర్‌బర్గ్ వ్యాఖ్యానించారు…మేటా లోగో ఆవిష్కరణ సందర్భంగా జూకర్ బర్గ్.. ‘‘ప్రస్తుత బ్రాండ్‌ ఇకపై మనకు కావాల్సిన సేవల అన్నింటినీ అందించలేకపోవచ్చు. ఈ పరిస్థితుల్లో మనం భవిష్యత్తుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఈ దిశలోనే మన సంస్థ బ్రాండ్‌ పేరు మారింది. ‘మెటావర్స్‌’లో భాగంగా పేరు మార్పు నిర్ణయం తీసుకున్నాం. వర్చువల్‌-రియాలిటీ స్పేస్‌లో రానున్న కాలంలో వినియోగదారులు ఎటువంటి అంతరాయం లేని అత్యున్నత స్థాయి సాంకేతిక సేవలను వినియోగం, సంబంధిత అంశాలు ‘మెటావర్స్‌’ పరిధిలోకి వస్తాయి…