ఈనెల 16న ఆటోల బంద్ …

ఈ నెల 16న ఆటోల బంద్ కు పిలుపు ఇచ్చాయి తెలంగాణ రాష్ట్ర ఆటో సంఘాలు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని తొందరపాటు నిర్ణయాలతో ఎంతో మంది బలైపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 50 రోజుల్లో 18 మంది ఆటో డైవర్ల ఆత్మహత్య చేసుకున్నారు.

ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ సర్కార్‌ ఏర్పడిన తర్వాత ‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం’ పథకం అమలు చేస్తోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం కారణంగా ఆటో డ్రైవర్ల పరిస్థితి దారుణంగా తయారైంది. దీంతో ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. అయితే..ఫ్రీ బస్సు వల్ల నష్టపోతున్నామని.. తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆటో డ్రైవర్లు ఈనెల 16న ఆటోల బంద్ కు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీఏటీయూ ఆటో యూనియన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య కోరారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంతో ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమకు న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు…