హైద‌రాబాద్‌లో న‌కిలీ మైసూర్ శాండిల్ స‌బ్బులు త‌యారీ..

_హైద‌రాబాద్ : న‌కిలీ మైసూర్ శాండిల్ స‌బ్బుల‌ను త‌యారు చేసి విక్ర‌యిస్తున్న ముఠాను మ‌ల‌క్‌పేట పోలీసులు శ‌నివారం అరెస్టు చేశారు. ప‌క్కా స‌మాచారంతో సోదాలు నిర్వ‌హించిన పోలీసులు న‌కిలీ ఉత్ప‌త్తుల‌తో పాటు దాదాపు రూ. 2 కోట్ల విలువైన త‌యారీ సామాగ్రిని సీజ్ చేశారు._

_హైద‌రాబాద్‌కు చెందిన రాకేశ్ జైన్, మ‌హావీర్ జైన్ క‌లిసి ఈ న‌కిలీ స‌బ్బుల‌ను త‌యారు చేస్తున్న‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. వారిద్ద‌రిపై పోలీసులు కేసు న‌మోదు చేసి, ద‌ర్యాప్తు చేప‌ట్టారు. అయితే క‌ర్ణాట‌క ప్ర‌భుత్వానికి చెందిన కేఎస్‌డీఎల్ సంస్థ‌కు మైసూర్ శాండిల్ స‌బ్బుల‌పై పేటెంట్ హ‌క్కులు ఉన్నాయి._

_హైద‌రాబాద్ కేంద్రంగా న‌కిలీ మైసూర్ శాండిల్ స‌బ్బులు మార్కెట్‌లోకి వ‌స్తున్న‌ట్లు కొన్ని రోజుల క్రితం క‌ర్ణాట‌క ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి, కేఎస్‌డీఎల్ చైర్మ‌న్ ఎంబీ పాటిల్‌కు స‌మాచారం అందింది. దీంతో తెలంగాణ అధికారుల‌కు, పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌డంతో తాజాగా దాడులు నిర్వ‌హించారు._