ఆపరేషన్‌ సిందూర్‌పై నకిలీ వార్తలు, తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవు..

హైదరాబాద్‌: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ (
)పై దుష్ప్రచారం చేసే వారికి తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరించింది. ఆపరేషన్‌ సిందూర్‌పై నకిలీ వార్తలు, తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేసినా.. పోస్టులు పెట్టినా చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. సోషల్‌ మీడియాను నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. అలాంటి సందేశాలు షేర్ చేసిన వారి వివరాలను 8712672222 నంబర్‌ వాట్సప్‌ ద్వారా పంపించవచ్చని సూచించింది.