ఆమ్మాయిల ఫోటోలతో ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లు..!.. దాదాపు వెయ్యి మందిని మోసగించి రూ.26 లక్షలు కాజేసిన కేటుగాడు..

ఆమ్మాయిల ఫోటోలతో ఫేక్ సోషల్ మీడియా అకౌంట్లు..।

దాదాపు వెయ్యి మందిని మోసగించి రూ.26 లక్షలు కాజేసిన కేటుగాడు..

బాధితుల్లో పోలీసులు, వైద్యులు, వ్యాపారవేత్తలు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, గిగ్ వర్కర్లు..

ఏపీ, కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల్లోనూ బాధితులు

ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలంలో నివసిస్తూ అనేక కంపెనీల్లో ఉద్యోగం చేసి మానేసి, ప్రస్తుతం కూకట్‌పల్లిలో నివాసం ఉంటున్న కె. పవన్ కుమార్ (23) అనే వ్యక్తి

అమ్మాయిల పేర్లు, ఫోటోలతో ఇన్‌స్టాగ్రామ్‌లో 13, ఫేస్‌బుక్‌లో 14 ఫేక్ అకౌంట్లు సృష్టించి, యువకులు, పురుషులకు అమ్మాయిగా పరిచయం చేసుకుని, వారి వ్యక్తిగత వివరాలు, న్యూడ్ ఫొటోలను సేకరించిన పవన్ కుమార్

అనంతరం అమ్మాయి అన్నను అని చెప్పి బెదిరించి డబ్బులు వసూలు చేయడం, మరికొందరి దగ్గర పెట్టుబడుల పేరిట వసూళ్లు చేయసాగిన నిందితుడు

బాధితుల్లో ఇన్‌స్పెక్టర్లు, అదనపు డీసీపీలతో సహా 14 మంది పోలీసులు, వైద్యులు, వ్యాపారవేత్తలు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, గిగ్ వర్కర్లు కూడా ఉన్నట్టు గుర్తింపు

నాలుగేళ్లలో దాదాపు రూ.26.16 లక్షలు సంపాదించినట్టు, ఫేక్ అకౌంట్ల కోసం కలకత్తాకు చెందిన యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్ యువతి ఫోటోను ఉపయోగించినట్టు పోలీసుల నిర్ధారణ

బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేసి మూడు సెల్‌ఫోన్లు, సిమ్ కార్డులు, ల్యాప్‌టాప్, పెన్‌డ్రైవ్ స్వాధీనం చేసుకున్న సైదాబాద్ పోలీసులు