ఫిల్మ్ చాంబ‌ర్‌తో సినీ కార్మి‌కుల చ‌ర్చ‌లు స‌ఫ‌లం..

ఫిల్మ్‌ ఫెడరేషన్, ఫిల్మ్‌ ఫెడరేషన్‌ సభ్యులు జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. వేతనాలు పెంచాలంటూ సమ్మె బాట పట్టిన సినీ కార్మికుల డిమాండ్ కు తెలుగు ఫిల్మ్ ఫెడ‌రేష‌న్ అంగీకరించింది. వేతనాలు పెంచుతామని తెలిపింది. దాంతో సినీ కార్మికుల సమ్మె ముగిసింది. ఇక రేప‌టి నుంచి య‌దావిధిగా సినిమా షూటింగ్స్ కొన‌సాగ‌నున్న‌ట్టు ఫిల్మ్ ఫెడ‌రేష‌న్ ప్ర‌క‌టించింది. ఫిల్మ్ ఫెడ‌రేష‌న్ ప్ర‌తినిధులు మాట్లాడుతూ.. పెంచిన వేతనాలు రేప‌టి నుంచి అమ‌లు చేస్తామన్నారు. ఆ బాధ్య‌త ఫెడ‌రేష‌న్, ఫిలించాంబ‌ర్ల‌దేన‌ని స్పష్టం చేశారు. వేతనం ఎంత పెంచాల‌న్న దానిపై రేపు చ‌ర్చించి నిర్ణ‌యిస్తామ‌ని తెలిపారు. త్వ‌ర‌లో వేత‌న పెంపు విధివిధానాల‌పై చ‌ర్చ‌లు జ‌రుగుతాయన్నారు. ప్రొడ్యూస‌ర్ కౌన్సిల్ చైర్మెన్ సి క‌ల్యాణ్ మాట్లాడుతూ..మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ చొర‌వ‌తో ఫిలిం ఫెడ‌రేష‌న్ స‌భ్యుల‌తో స‌మావేశం నిర్వ‌హించామన్నారు. వేత‌నాల పెంపున‌కు దిల్‌రాజు నేతృత్వంలో ఏర్పాటు చేసిన కోఆర్డినేష‌న్ క‌మిటీ శుక్ర‌వారం స‌మావేశం అవుతుంద‌ని తెలిపారు.