బ్రేకింగ్: రేపటి నుంచి తెలుగు సినిమా షూటింగ్‌ లు బంద్..!

ఇటీవల హైదరాబాద్‌ లోని ఫిల్మ్‌ ఛాంబర్‌ లో టిక్కెట్‌ ధరలు, ఓటీటీ విడుదల, కార్మికుల దినసరి వేతనం తదితర సమస్యల పై సమావేశం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఆగస్ట్ 1 నుంచి సినిమా షూటింగ్‌లను నిలిపి వేస్తున్నట్లు యాక్టివ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రెస్ నోట్ విడుదల చేసింది. తాజా పరిణామంలో, నిర్మాతల సంఘం నిర్ణయాన్ని సమర్ధిస్తూ రేపటి నుంచి సినిమా షూటింగ్‌లను నిలిపివేయాలని తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి నిర్ణయించింది…

దిల్ రాజు సమక్షంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసే అధికారికంగా ప్రకటించారు… రేపటి నుంచి తెలుగు సినిమా షూటింగులు ఆపివేయాలని ఫిలిం ఛాంబర్ నిర్ణయం తీసుకుందని ప్రకటించారు. ప్రొడ్యూసర్స్ గిల్డ్ తీసుకున్న నిర్ణయానికి ఛాంబర్ పూర్తి మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో రేపటి నుండి మొత్తం అన్ని సినిమాల షూటింగులు నిలిచిపోనున్నాయి. నిర్మాణంలో ఉన్న భారీ బడ్జెట్ సినిమాలు మొదలు చిన్న బడ్జెట్ సినిమాల చిత్రాల వరకు అన్ని షూటింగ్స్ రేపటి నుండి బంద్ చేయనున్నారు…ఈ క్రమంలో దిల్ రాజు మాట్లాడుతూ రేపటి నుంచి తెలుగు సినిమా షూటింగులు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నామని, జనరల్ బాడి మీటింగ్ లో ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. మళ్లీ కూర్చొని మాట్లాడుకుంటామన్న ఆయన సమస్యలకి పరిష్కారం దొరికేంత వరుకు ఈ నిర్ణయం ఉంటుందని అన్నారు. ఇప్పటికే చాలా సినిమాలు రన్నింగ్ లో ఉన్నాయని, రన్నింగ్ లో ఉన్న సినీమా షూటింగ్ లు కుడా జరగవని దిల్ రాజు ప్రకటించారు. సినిమా నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో హీరోల రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలని నిర్మాతలు కోరుతున్నారు. కేవలం హీరో రెమ్యూనరేషన్ లే కాక మేనేజర్లు, కోఆర్డినేటర్ల వ్యవస్థ కూడా పూర్తిగా రూపు మాపే విధంగా ప్రణాళికల సిద్ధం చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. నిజానికి కరోనా మహమ్మారి ప్రారంభమైన తర్వాత థియేటర్లకు వచ్చి సినిమాలు చూసే ప్రేక్షకుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. మరికొద్ది రోజులు ఆగితే ఎలాగో డిజిటల్ వేదికగా సినిమాలు అందుబాటులోకి వస్తున్నాయని భావిస్తున్న ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి వేలకు వేలు ఖర్చుపెట్టి సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపించడం లేదు…ఈ నేపథ్యంలోనే సినిమాలు ఓటీటీకి ఇవ్వాలన్నా కనీసం 50 రోజులు మినిమం వ్యవధి ఉండేలాగా చూసుకోవాలని కూడా నిర్మాతలు భావిస్తున్నారు. అయితే ఒక పక్క తెలుగు ఫిలిం ఛాంబర్ ఈమెరకు నిర్ణయం తీసుకుంటే తెలంగాణ ఫిలిం ఛాంబర్ మాత్రం ఈ విషయాన్ని వ్యతిరేకిస్తున్నామని తమ షూటింగ్స్ నిలిపివేస్తే కనుక ఊరుకునే ప్రశక్తి లేదని హెచ్చరించారు. కేవలం నలుగురి నిర్మాతలు మాత్రమే తీసుకున్న నిర్ణయానికి తాము కట్టుబడి ఉండమని ఏదైనా ఉంటే అందరితో కలిసి చర్చించి నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతున్నారు….రేపటి నుంచి తెలుగు సినిమా షూటింగులు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నాము…

జనరల్ బాడి మీటింగ్ లో ఈ నిర్ణయం తీసుకున్నాం..మళ్లీ కూర్చొని మాట్లాడుకుంటాము*

సమస్యలకి పరిష్కారం దొరికేంత వరుకు ఈ నిర్ణయం ఉంటుంది.