…ప్రభాస్ ‘సలార్’ మూవీకి భారీ క్రేజ్….

రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ కేజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తోన్న ప్రతిష్టాత్మక చిత్రం సలార్. తాజాగా ఈ సినిమాకు విడుదలకు యేడాది ముందే భారీ డీల్‌ కుదిరినట్టు సమాచారం...

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సలార్. హోంబాలే ఫిలిమ్స్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెస్ట్ తో పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ నటిస్తోంది. ఎప్పుడో పూజా కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ చిత్రంపై ప్రేక్షకులను భారీ అంచనాలు పెట్టుకున్నారు. కెజిఎఫ్ చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన ప్రశాంత్ నీల్, ప్రభాస్ ని ఊర మాస్ అవతారంలో చూపించనున్నాడు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన దీర్స్ లుక్ పోస్టర్ ఇప్పటికీ వైరల్ గా మారుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా గురించి హోంబాలే ఫిలిమ్స్ అధినేత, నిర్మాత విజయ్ కిరగండూర్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారాయి…ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ” సలార్ సినిమా 30 శాతం షూటింగ్ ని పూర్తిచేసుకుంది. మిగతా షూటింగ్ ని మే లో మొదలుకానుంది. ఇక ఈ ఏడాది చివరిలోపు షూటింగ్ ని పూర్తిచేసి, 2023 ఏప్రిల్ కానీ, జూన్ లో కానీ సినిమాను రిలీజ్ చేస్తాం” అని చెప్పుకొచ్చారు. ఇకఎట్టకేలకు సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయడంతో ప్రభాస్ అభిమానులు వచ్చే ఏడాది కోసం ఎదురుచూస్తున్నారు. అయితే గతేడాది షూటింగ్ నిమొదలుపెట్టిన ఈ సినిమా ఇప్పటివరకు 30 శాతం మాత్రమే పూర్తిచేసింది అంటే.. ప్రశాంత్ నీల్ ఎంత పర్ఫెక్ట్ గా సినిమాను చెక్కుతున్నాడో అర్ధం అవుతుందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రభాస్ ఊర మాస అవతారంతో యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.