దహి పనీర్ మసాలా… తయారీ..

కావలసినవి: 
పనీర్‌ ముక్కలు: ఒకటిన్నర కప్పు,
నూనె: మూడు టేబుల్‌స్పూన్లు, జీలకర్ర: చెంచా,
బిర్యానీ ఆకు: ఒకటి,
దాల్చినచెక్క: ఒక ముక్క,
ఉల్లిపాయ: ఒకటి,
పెరుగు: ఒకటిన్నర కప్పు,
సెనగపిండి: రెండు టేబుల్‌స్పూన్లు,
కారం: రెండు చెంచాలు,
ఉప్పు: తగినంత,
కసూరీమేథీ: చెంచా,
కొత్తిమీర: కట్ట,
దనియాలపొడి: అరచెంచా,
గరంమసాలా: పావుచెంచా.

తయారీ విధానం: ముందుగా మిక్సీ జారులో పెరుగు, సెనగపిండి, కారం, ఉప్పు, దనియాలపొడి, గరంమసాలా వేసుకుని గ్రైండ్‌ చేసి తీసుకోవాలి.
స్టౌమీద కడాయి పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక జీలకర్ర, బిర్యానీ ఆకు, దాల్చినచెక్క, ఉల్లిపాయముక్కలు వేసి వేయించాలి.
అవి వేగాక ముందుగా చేసుకున్న పెరుగు మిశ్రమం వేసి కాసిని నీళ్లు పోయాలి. ఇది ఉడికి చిక్కగా అవుతున్నప్పుడు
పనీర్‌, కసూరీమేథీ, కొత్తిమీర తరుగు వేసి కలిపి దింపేయాలి.🍁