రాష్ట్రపతికి ఓ మహిళ రాసిన లేఖ వైరల్‌గా మారింది.

మధ్యప్రదేశ్‌లో రాష్ట్రపతికి ఓ మహిళ రాసిన లేఖ వైరల్‌గా మారింది. మాండ్‌సౌర్ జిల్లాకు చెందిన ఆ మహిళ తనకు హెలికాప్టర్ కొనడానికి రుణం ఇవ్వమని రాష్ట్రపతికి రాసిన లేఖలో పేర్కొంది. అసలు ఏం జరిగిందంటే.. తన పొలం సరిహద్దుల్లో ఉన్న మరో పొలం యజమాని దారిని మూసివేయడంతో తన వ్యవసాయ క్షేత్రానికి చేరుకోవడం అసాధ్యంగా మారింది. ఇదే విశయాన్ని చాలాసార్లు స్థానిక జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసింది. అధికారులకు గత కొంతకాలం తాను ఫిర్యాదు చేసిన వారి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఆందోళన వ్యక్తం చేసింది.దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ మహిళా రైతు…తన సమస్యను తానే పరిష్కరించుకోవాలని అనుకుంది. వెంటనే తన సమస్యపై రాష్ట్రపతికి ఒక లేఖ రాసింది. ఆ తరువాత ఆమె తన లేఖతో తన ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది, అంతే అది కాస్తా వైరల్ అయ్యింది.