కరెంట్ షాక్ కొట్టి కాకినాడలో ముగ్గురు రైతులు మృతి..

కరెంట్ షాక్ కొట్టి కాకినాడలో ముగ్గురు రైతులు మృతి..

కాకినాడ – ఉప్పలపాడు నుండి రాజపూడి వెళ్లే దారిలో పొలం వద్ద బోరు బావి మోటారు ఎత్తుతుండగా కరెంటు వైర్లు తగిలి ముగ్గురు వ్యక్తులు మృతి. ఒకరు బోరుకు సంబంధించిన రైతు కాగా మిగిలిన ఇద్దరు జగ్గంపేటకు చెందినవారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులను బోదిరెడ్డి సూరిబాబు, కిల్లి నాగు, గల్ల బాబీగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…