కుమారుడికి ఉద్యోగం రాలేదు…60 ఏళ్లు నిండిన తండ్రికీ పింఛను రాలేదు.పండించిన సన్నరకం ధాన్యానికి మద్దతు ధర రాలేదు.. రైతు ఆత్మహత్య…

R9TELUGUNEWS.COM.: పండించిన పంటకు గిట్టుబాటు ధర రాలేదని, ఇంజినీరింగ్‌ చేసిన కుమారుడికి ఉద్యోగం లేదనే ఆవేదనతో ఓ రైతు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
మెదక్‌ జిల్లా హవేలిఘనపూర్‌ మండలం బొగుడ భూపతిపూర్‌లో ఈ ఘటన జరిగింది. మృతుడిని కరణం రవికుమార్‌(40)గా పోలీసులు గుర్తించారు. అయితే, ఘటనాస్థలి వద్ద సీఎం కేసీఆర్‌కు మృతుడు రవి రాసిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ‘ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన కుమారుడికి ఉద్యోగం రాలేదు.60 ఏళ్లు నిండిన తన తండ్రికీ పింఛను రావట్లేదు. పండించిన సన్నరకం ధాన్యానికి మద్దతు ధర రాలేదు’ అని రైతు లేఖలో పేర్కొన్నారు.