తీవ్ర విషాదం.. ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి..

తీవ్ర విషాదం.. ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి….

మానవపాడు: జోగులాంబ గద్వాల జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.  మానవపాడు మండలం పల్లెపాడు గ్రామ శివారులోని కృష్ణానదిలో ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి చెందారు. వీరంతా ఇటిక్యాల మండలం వల్లూరు గ్రామానికి చెందిన వారని తెలిసింది. వివాహ శుభకార్యం నిమిత్తం మానవపాడు మండలం బోరువెల్లి గ్రామానికి రెండు రోజుల క్రితం వచ్చి కుటుంబ సమేతంగా బంధువులతో కలిసి మెలిసి గడిపారు.
కృష్ణా నదిలో స్నానం చేయాలని తలంచి సమీపంలోని పల్లెపాడు శివారులో ఉన్న కృష్ణానదికి వెళ్లారు.  ఐదుగురు చిన్నారులు వెళ్గగా నలుగురు కృష్ణా నదిలో మునిగిపోయారు. ఓ పాప మాత్రం ఒడ్డున ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.