ఫ్రాన్స్‌లో ఒకే రోజు లక్ష కేసులు.!!!

*ప్యారిస్‌.. ఫ్రాన్స్‌లో ఒకే రోజు లక్ష కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 1,04,611 మందికి పాజిటివ్‌గా తేలినట్లు ఫ్రాన్స్‌ శానిటరీ అథారిటీ వెల్లడించింది. మహమ్మారి వెలుగులోకి వచ్చిన తర్వాత ఒకే రోజు అత్యధిక కేసులు ఇవే కావడం గమనార్హం. దేశంలో ఒమిక్రాన్‌ వ్యాప్తి ఎక్కువగా ఉందని ఫ్రాన్స్‌ వైద్య శాఖ మంత్రి ఒలీవర్‌ వెరన్‌ పేర్కొన్నారు. మరికొద్ది రోజుల్లో ఒమిక్రాన్‌ కేసులే అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు