ఫ్రాన్స్‌కు బ‌య‌ల్దేరిన మంత్రి కేటీఆర్ బృందం….

**

తెలంగాణ ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ బృందం బుధ‌వారం ఉద‌యం ఫ్రాన్స్‌కు బ‌య‌ల్దేరింది. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరగనున్న పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంత్రి కేటీఆర్ బృందం పాల్గొన‌నుంది.

ఫ్రెంచ్ సెనేట్‌లో జరిగే యాంబిషన్ ఇండియా 2021 కార్యక్రమంలో ఈ నెల 29న మంత్రి కేటీఆర్ కీలకోపన్యాసం చేయనున్నారు. పలువురు ఫ్రెంచ్ పారిశ్రామికవేత్తలు, సీఈవోలతో కేటీఆర్ సమావేశం కానున్నారు. కేటీఆర్‌తో పాటు ప్రతినిధి బృందంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజ‌న్, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.