ఉచిత రేష‌న్ పథకం గడువు పొడిగింపు…

ఉచిత రేష‌న్ పథకం గడువు పొడిగింపు…

ఉచిత రేష‌న్ ప‌థకాన్ని కేంద్ర ప్రభుత్వం మ‌రో మూడు నెల‌లు పొడిగించింది. దాంతో డిసెంబరు 31 వరకు ఈ ఉచిత రేషన్‌ను కొనసాగించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలో బుధవారం కేంద్ర క్యాబినెట్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. దీంతో కేంద్ర ఖజానాపై మరో రూ.44,700 కోట్ల మేర అదనపు భారం పడనుందని కేంద్రం తెలిపింది.
అలాగే పీఎం గ‌రీబ్ క‌ళ్యాణ్ అన్న యోజ‌న ప‌థకాన్ని మ‌రో మూడు నెలలు పొడిగించాల‌ని కేంద్ర క్యాబినెట్ నిర్ణ‌యించింద‌ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. భార‌తీయ రైల్వేలను అప్‌గ్రేడ్ చేసేందుకు రూ 10,000 కోట్లను కూడా కేంద్రం ప్ర‌క‌టించింది…