ఈ నెల 4 నుంచి  15 కిలోల ఉచిత బియ్యం..

హైద్రాబాద్

ఈ నెల 4 నుంచి 19 వరకు ప్రతి రేషన్​లబ్ధిదారునికి ఉచితంగా 15 కిలోల బియ్యం పంపిణీ చేయనున్నారు.
ప్రధానమంత్రి గరీబ్‌‌‌‌‌‌‌‌ కళ్యాణ్‌‌‌‌‌‌‌‌ యోజన (పీఎంజీకేఏవై)కు సంబంధించి మే నెలలోని అదనపు కోటా (5 కిలోలు)తో కలిపి ఈ మొత్తాన్ని ప్రభుత్వం అందజేయనుంది.
వాస్తవానికి మే నెల నుంచే పీఎంజీకేఏవై అదనపు కోటాను కొనసాగించాల్సి ఉంది.
కానీ జూన్‌‌‌‌‌‌‌‌ 20 నుంచి మాత్రమే రాష్ట్ర సర్కారు అదనపు కోటాను ప్రారంభించింది.
మే నెలలో ఇవ్వాల్సిన అదనపు కోటా బియ్యాన్ని ఆగస్టుకు అడ్జెస్ట్‌‌‌‌‌‌‌‌ చేసుకుని పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చింది.