ప్రస్తుతం గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బయటకు అడుగు పెట్టాలంటేనే అందరూ బెంబేలెత్తుతున్నారు. ఈ తరుణంలో ఎండ వేడిని తట్టుకునేందుకు చాలా మంది ఫ్రిడ్జ్లోని నీటిని గటగటా తాగేస్తుంటారు. అయితే ఇది అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫ్రిడ్జ్ ని కూలింగ్ వాటర్ను ఎక్కువగా తాగితే గొంతు ఇన్ఫెక్షన్లు, జీర్ణ సంబంధిత సమస్యలు, గ్యాస్ట్రిక్, ఉదర సంబంధిత వ్యాధులు వస్తాయని వైద్యులు పేర్కొంటున్నారు. దాహాన్ని తీర్చుకునేందుకు ఫ్రిడ్జ్ నీరు తాగితే శరీరంలో వేడి ఇంకా ఎక్కువవుతుందని చెబుతున్నారు. వేసవి తాపాన్ని తట్టుకునేందుకు మజ్జిగ, కొబ్బరి బొండాలు తాగాలని, తద్వారా శరీరానికి అవసరమైన ఖనిజాలు లభిస్తాయని సూచిస్తున్నారు…కూల్ వాటర్ ఎక్కువ తాగితే తలనొప్పి, సైనస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే చల్లని నీళ్లు తాగినప్పుడు బ్రెయిన్ ఫ్రీజ్ అవుతుంది. అంటే కొన్ని సెకన్లపాటు నరాలు చల్లపడి జివ్వుమని నొప్పి పుడుతుంది. ఇలా జరిగితే బ్రెయిన్ పైన ఎఫెక్ట్ పడే ప్రమాదం ఉంది. గుండె, ఊపిరితిత్తులు, జీర్ణ వ్యవస్థలను కంట్రోల్ చేసే వాగస్ నాడి శరీరంలో మెడ దగ్గర ఉంటుంది. కూల్ వాటర్ తాగడం వల్ల నాడీ వ్యవస్థ చల్లపడి హార్ట్ రేట్, పల్స్ రేట్ తగ్గి, హార్ట్ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. తిన్న వెంటనే కూల్ వాటర్ తాగితే శరీరం లోని కొవ్వు బయటికి పోదు. దీంతో బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి. బరువు తగ్గాలనుకున్న వాళ్లు కచ్చితంగా కూల్ వాటర్‌కు దూరంగా ఉంటే మంచిది. ఎండాకాలంలో ఎక్కువ కూల్ వాటర్ తాగే బదులు ఫ్రూట్ జ్యూస్‌లు, కొబ్బరి నీళ్లు తాగడం బెటర్. ఇలా చేస్తే హెల్దీగా ఉండొచ్చు. ఆహారం కూడా సులభంగా జీర్ణమవుతుంది…
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.