ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు అంత్యక్రియలు..

రఘునాథపాలెం మండలం ఈర్లపుడిలో ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు అంత్యక్రియలు..

ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు పై గుత్తి కోయల దాడిలో ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన శ్రీనివాసరావు మృతి పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండలపాడు గ్రామం ఎర్రబొడులో ప్లాంటేషన్ మొక్కలను నరుకుతుండగా అడ్డుకున్న ఫారెస్ట్ రేంజర్ అధికారి శ్రీనివాసరావు పై గుత్తికోయలు కత్తులతో దాడి చెయ్యగా తీవ్రంగా గాయపడ్డ రేంజర్ శ్రీనివాసరావు ఖమ్మంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం బాధాకరమన్నారు. శ్రీనివాస రావు ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని, ఆయ‌న కుంటుబ సభ్యుల‌కు మ‌నోధైర్యాన్ని ఇవ్వాల‌ని కోరుకున్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన శ్రీనివాసరావు కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షలు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇంటి స్థలం ప్రకటించింది. వారి స్వస్థలం రఘునాథపాలెం మండలం ఈర్లపుడి గ్రామంలో రేపు 23న ప్రభుత్వ అధికారిక లంచనలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అత్యక్రియల్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హాజరుకానున్నారు.