అయోధ్య రామాలయానికి పాదయాత్రగా బయలుదేరిన ముస్లిం యువతి. మతసామరస్యాన్నికి ఇదే నిదర్శనం..!.

*అయోధ్య రామాలయానికి పాదయాత్రగా బయలుదేరిన ముస్లిం అమ్మాయి.

మధ్యప్రదేశ్ డిసెంబర్ 29
అయోధ్యలో రామయ్య కొలువు దీరే సమయం ఆసన్నమవుతోంది. కోట్లాది మంది హిందువుల కల తీరే సమయనికి అయోధ్య సర్వాంగసుందరంగా అలంకరించుకుంటుంది.

మరోవైపు అయోధ్య రామయ్య సేవలో మేము సైతం అంటూ పలువురు రామయ్య భక్తులు రకరకాల వస్తువులను కానుకగా సమర్పిస్తున్నారు. అయితే రామయ్య సేవకు నేను సైతం అంటోంది ఓ ముస్లిం యువతి..

కాషాయ జెండా చేతబూని అయోధ్య రామమందిర బ్యానర్ తో రాములోరి గుడికి బయలు దేరింది. మూస పద్ధతులకు సవాల్ చేస్తూ.. సర్వమత సమాన త్వాన్ని చాటే విధంగా దేశ ఆర్ధిక రాజధాని ముంబైకి చెందిన షేక్ షబ్నం అనే యువతి ముంబై నుండి అయోధ్యకు పాదయాత్రగా తన ప్రయాణాన్ని ప్రారంభిం చింది.

తన స్నేహితులైన రామన్ రాజ్ శర్మ, వినీత్ పాండేతో కలిసి షబ్నమ్ 1,425 కిలోమీటర్ల దూరం కాలి నడకన ప్రయాణించడానికి బయలుదేరింది. ప్రస్తతం షబ్నం వార్తల్లో నిలిచింది. ఎందుకంటే షబ్నమ్ ప్రయాణం ప్రత్యేకమైనది.

జన్మతః ముస్లిం అయిన రాముని పట్ల ఆమెకు అమోఘం మైన భక్తి. శ్రీరాముడిని ఆరాధిం చడానికి హిందువు కానవసరం లేదని షబ్నం గర్వంగా చెబుతుంది.

మంచి మనిషిగా ఉండడమే ముఖ్యం. ప్రస్తుతం షబ్నం మధ్యప్రదేశ్‌లోని సింధవకు చేరుకుంది. ప్రతిరోజూ 25-30 కిలోమీటర్లు మేర నడుస్తూ ముంబై నుంచి ఈరోజు మధ్యప్రదేశ్ లో అడుగు పెట్టింది..